ఎవరు రాసిన మాటలు ‘మనసుని కదిలిస్తాయో, కనులని తడిచేస్తాయో, పెదవులని నవ్విస్తాయో, కలకాలం నిలుస్తాయో’ ఆయనే త్రివిక్రమ్. మాటలే అయన నోటి నుండి రావాలని, కలం నుండి జారాలని తపించిపోతాయి అనటం లో సందేహం ఏ మాత్రం లేదు. ఆయన మాటలు వింటే, నిశబ్దం కూడా మౌనంగా రోదిస్తుంది, నేనెందుకు మాటని కాలేకపోయానా అని. హాస్యం అయిన లాస్యం అయిన, ప్రేమ అయిన ద్వేషం అయిన, సందేశం అయిన సంతోషం అయిన, ఒక్కటేమిటి ఏదైనా త్రివిక్రమ్ రాసాడంటే ఎప్పటికి గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ పలుకులతో శరీరాన్ని పులకరింపచేస్తాడు, మాటలతో మనసుని మురిపిస్తాడు. అద్భుతమైన ప్రాసలతో అర్ధవంతమైన సంభాషణలు ఎక్కడైనా వినిపించాయంటే అవి త్రివిక్రమ్ రాసినవే. కష్టాల గురించి చెపుతాడు, ఆనందం ఎక్కడ ఉందొ వెతకమంటాడు, ప్రేమకు నిర్వచనం ఇస్తాడు, ఉద్యమ స్పూర్తి కలిగిస్తాడు, తప్పుని ఎత్తిచూపుతాడు.. ఇలా దేని గురించి రాసిన అందరికి అర్ధమయ్యేలా సరళ భాషలోనే రాస్తాడు. ఇప్పుడు వస్తున్నా చిత్రాలలోని సంభాషణలు అన్నిటిలో ప్రాస కోసం పాకులడుతున్నారు. కాని ఆయన ప్రాస కోసం పాకులాడరు, ఎక్కడ అవసరమో అక్కడ వాడతారు. మాటలతోనే మత్తేక్కిస్తాడు, మాయ చేస్తాడు, మారుస్తాడు త్రివిక్రమ్. ఆయన కలం లో ఉంటె మాటలు కూడా తూటాల్లా మారిపోతాయ్. ఈ రోజు మన మాటల మాంత్రికుని పుట్టిన రోజు సందర్భంగా ఆయనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇలా మరెన్నో పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని, ఇంకా ఉన్నత స్తాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: