బాపు బొమ్మలా ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కన్నడ మందారం ప్రణితకు అత్తారిల్లు ఇచ్చిన విజయంతో టాలీవు అత్తారింటికి దారేది సినిమా మాత్రం ప్రణీత జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో చేసింది రెండో హీరోయిన్ పాత్రే అయినా కానీ గుర్తింపు లో మాత్రం మొదటి హీరోయిన్ సమంత కన్నా ఎక్కువ పేరు వచ్చింది. దీనితో ప్రణీతకు ఈ సినిమా తర్వాత వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి.  ఇప్పటికే ఎన్టీఆర్, కందిరీగ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ఈ బెంగుళూరు భామకు ఇప్పుడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రేజీ ప్రాజెక్ట్ 'బాహుబలి'లో ఓ పాత్ర కోసం ప్రణీతను ఎంచుకోనున్నారని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు జోడిగా అనుష్క నటిస్తుండగా రానాకు జంటగా నటించే హీరోయిన్ స్థానం ఖాళీగా ఉంది. రానాకు జంటగా సరిపడే అందమైన హీరోయిన్ కోసం రాజమౌళి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. రాణిలా కనిపిస్తూ రానాకు జోడిగా నిండుగా కనిపించేఅమ్మాయిలా ప్రణిత బాగుంటుంది. అనే అభిప్రాయం రాజమౌళికి ‘అత్తారిల్లు సినిమా చూసినతరువాత ఏర్పడింది అని అంటున్నారు.  ఈ వార్తలే నిజమైతే ప్రణిత దశ తిరిగిందనే అనుకోవాలి. ఇప్పటికే టాలీవుడ్ పరిశ్రమను ఏలుతున్న సమంతా, సృతిహాసన్ లు తమ సినిమాలను తగ్గించు కుంటున్న నేపధ్యంలో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలో అవకాసం వస్తే ప్రణిత టాప్ హీరోయిన్ ల లిస్టు లో చేరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: