పోకిరి సినిమా క్లయిమాక్స్ లో ఓ అద్భుతమయిన సీన్ ఉంటుంది. మహేశ్ బాబు డిటెయిల్స్ చెప్పమని ప్రకాశ్ రాజ్ నాజర్ ని చిత్రహింసలు పెట్టే సన్నివేశమది. అత్యద్భుతమైన నాజర్ నటన ఇప్పటికీ మర్చిపోలేం. ఆ పాత్రలో ఇమిడిపోవడమే కాదు... తన ప్రతిభతో ప్రాణం పోశాడాయన. మహేశ్ కి పర్ ఫెక్ట్ తండ్రిలా అనిపించాడు. ఇప్పుడు ఆర్పీ కూడా అలాంటి తండ్రి అవుతున్నాడు. ఆర్పీ అంటే ఆర్పీ పట్నాయక్ కాదండీ... నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆగడు సినిమాలో మహేశ్ బాబు మళ్లీ పోలీసాఫీసరుగా నటిస్తున్నాడు. అతడి తండ్రి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆ పాత్రకు ఓ ఫేమస్ నటుడిని, ఇంకా చెప్పాలంటే గొప్ప పర్ ఫార్మర్ ని తీసుకోవాలని శ్రీనువైట్ల అనుకున్నాడు. ఎవరిని తీసుకుందామా అని ఆలోచిస్తుంటే అతడి మదిలో రాజేంద్ర ప్రసాద్ మెదిలాడట. దాంతో ఆయనకు ఫిక్సయ్యాడని తెలుస్తోంది. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలతో ఆర్పీలోని మరో గొప్ప కోణం బయటపడింది. అతడి నటన లోతెంతో మరోసారి బయటపడింది. అలాంటివాడిని తీసుకున్నారంటే అది తప్పక గొప్ప రోల్ అయివుంటుంది. అదేంటో చూడాలంటే... ఇంకా కొన్ని నెలలు ఆగాల్సిందే!  

మరింత సమాచారం తెలుసుకోండి: