ఒక సెలెబ్రెటీ గా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా జాతీయస్థాయిలో ఒక వ్యక్తికి గుర్తింపు రావాలి అంటే ఆ వ్యక్తి పట్ల ప్రజలలో విపరీతమైన ఆరాధనా భావం ఉండాలి. సామాన్యంగా ఇటువంటి క్రేజ్ సినిమా నటీనటులకు, క్రికెటర్లకు ప్రజలలో వస్తూ ఉంటుంది. ప్రస్తుత సమకాలిన సినిమా రంగంలో అమితాబ్ బచన్, రజనీకాంత్, కమలహాసన్, షారుక్ ఖాన్ లాంటి ప్రముఖ సినిమా సెలెబ్రెటీలకు పార్టీలతో వర్గాలతో సంబంధం లేకుండా వాళ్ళ క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది  మరొక విషయంగా చెప్పాలి అంటే సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వీళ్ళ గురించిన వార్తలు విశేషాలు చదవడానికి ప్రజలు ఉత్సాహం చూపెడుతూ ఉంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమితాబ్. అయన ట్విటర్ కు ఇప్పటికే 70 లక్షల అభిమానులు ఉన్నారు. ఈ ప్రముఖుల సరసన జాతీయస్థాయిలో సెలెబ్రెటీ హోదాకు పవన్ అతి చేరువలో ఉన్నాడనే అనుకోవాలి. వెబ్ మీడియా లో పవన్ కళ్యాణ్ కు అఫీషియhttps://www.google.com/ల్ పేజ్ లేదుకాని పవన్ తన భావాలను పంచుకోవడానికి వెబ్ మీడియాను ఉపయోగించుకుంటే ఈ పాటికే ఆయనకు దేశవ్యాప్తంగా కోటి మంది ఫాలోయర్స్ ఏర్పడి ఉండేవారని అనిపిస్తుంది.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది హీరోలు, హీరోయిన్స్ పవన్ కు ప్రత్యక్ష అభిమానులుగా చెప్పుకుంటున్నారు. సమంతా, నితిన్, నిఖిల్, మంచు మనోజ్, కృతి కర్బందా, రామ్ గోపాల్ వర్మా లాంటి సెలెబ్రెటీలు అంతా వెబ్ మీడియా ద్వారా చేస్తున్న పవనిజమ్ జపంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జాతీయస్థాయి సెలెబ్రెటీల స్థాయికి చేరిపోయాడు. ఈ లిస్టు లో మరో తమిళ సేలిబ్రెటీ చేరిపోయింది. మిస్ చెన్నై గా ఎంపికై సినిమాలలో కూడా నటిస్తున్న చాందిని ఈమధ్య ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తాను చిన్నతనం నుండి పవన్ సినిమాలు చూసి పెరిగానని తనకు సినిమాల పై అభిరుచి ఏర్పడడానికి కారకుడు పవన్ కళ్యాణ్ అంటు ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఇలా అమెరికా నుండి అమలాపురం వరకూ రాష్ట్రాలు, హద్దులు దాటి పెరిగిపోతున్న పవనిజమ్ ఇప్పటికి స్థాయిలో ఉంటే రేపటికి ఏ స్థాయికి ఎదుగుతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: