ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ గ‌బ్బర్‌సింగ్‌2. ఈ మూవీకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ షూటింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇక గ‌బ్బర్‌సింగ్‌2 షూటింగ్ షెడ్యూల్స్‌ను ఎప్పటి నుండి మొద‌లు పెట్టి, ఎప్పటికి పూర్తి చేయాల‌ని అనేదే ప్రస్తుతం ఉన్న ఆలోచ‌న‌. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌బ్బర్‌సింగ్‌2 మూవీను ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేదానిపై ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నాడంటూ టాలీవుడ్‌లో న్యూస్ వినిపిస్తుంది. ఆ డేట్ మే 11, 2014 అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక స‌మాచారం రాలేదు. కాని ఇదే గ‌బ్బర్‌సింగ్2 రిలీజ్ డేట్ అంటూ అంద‌రి నోట నుండి వినిపిస్తున్న మాట‌. ప్రస్తుతం గ‌బ్బర్‌సింగ్‌2 చిత్ర యూనిట్ షూటింగ్‌కు సంబంధించిన డేట్స్‌ను ఫైన‌లైజ్ చేసుకునే ప‌నిలో బిజిగా ఉన్నారు. అలాగే హీరోయిన్ ఎంపిక‌లోనూ క్లారిటి రావాల్సి ఉంది. సంప‌త్‌నంది ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న గ‌బ్బర్‌సింగ్‌2 మూవీపై ఇండ‌స్ట్రీలోనూ హాట్ టాపిక్ న‌డుస్తుంది. ఈ మూవీతో సంప‌త్‌నంది బ్లాక్‌బ‌స్టర్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోవ‌డం ఖాయం అని అంటున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాన్ మాత్రం గ‌బ్బర్‌సింగ్‌2కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇంకా ఎవ‌రితోనూ చ‌ర్చించ‌లేద‌ని, ఈ డేట్ అనేది సాధారణంగా అంద‌రూ అనుకుంటున్న ఓపెన్ టాక్ మాత్రమే అంటూ చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: