టైటిల్ ని బట్టి సినిమా ఇలా ఉంటుంది అని అంచనాలు వేయడం మానేయాల్సిన టైమొచ్చింది. మసాలా అని పేరు పెట్టారు కదా అని అందులో ఏవేవో ఊహించారంతా. కానీ అవేమీ లేవని సెన్సార్ రిపోర్ట్ వస్తేనే గానీ తెలిసి రాలేదు. బోల్ బచ్చన్ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాని ఏ పేరు పెడతామా అని మల్లగుల్లాలు పడ్డాడు దర్శకుడు విజయభాస్కర్. చివరకు మసాలా అయితే మస్తుగా ఉంటుందని డిసైడయ్యారు. ఆ పేరు ప్రేక్షకులకి కూడా బాగా ఎక్కేసింది. పైగా... పేరే ఇంత ఘాటుగా ఉంటే సినిమాలో ఎంత ఘాటు సీన్లు ఉంటాయో అంటూ నోరు చప్పరించారు కూడా. కానీ అంత సీన్ లేదక్కడ. సినిమా చాలా క్లీన్ గా ఉందంటూ సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ మధ్య సెన్సార్ వాళ్లు ప్రతి సినిమాకీ ఎ సర్టిఫికెట్ కట్టబెట్టేస్తున్నారు. ఓ చిన్న తిట్టు ఉంటే అసభ్యత అంటున్నారు. హీరోయిన్ మోకాళ్ల పైకి స్కర్టు వేసినా అశ్లీలత అంటున్నారు. అలాంటికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మసాలాకి యు సర్టిఫికెట్ ఇచ్చారంటే తెలియట్లా... అది ఫక్తు ఫ్యామిలీ సినిమా అని. మరి అలాంటి సినిమాకి మసాలా అని పేరెందుకు పెట్టినట్టు! సినిమాలో ఎలాగూ ఏమీ ఉండదు కాబట్టి టైటిల్ తో కిక్కెక్కించేద్దామని ప్లాన్ వేశారేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: