ఈ మ‌ధ్య కాలంలో ప్రియ‌మ‌ణి న‌టించిన మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద బోల్తాకొట్టడ‌మే కాకుండా ప్రియ‌మ‌ణికు తీర‌ని డామేజ్‌ను మిగులుస్తున్నాయి. లేటెస్ట్‌గా త‌ను న‌టించిన చండీ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీపై మొద‌టి నుండి నెగిటివ్ టాక్ వ‌స్తున్నప్పటికీ రిలీజ్‌కు ముందు వారం రోజుల నుండి ప‌బ్లిసిటితో తెగ ఊధ‌గొడుతున్నారు. దీంతో ప్రియ‌మ‌ణి న‌టించిన చండీ మూవీపై కొద్దిపాటి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను అభిమానులు పెట్టుకున్నారు. తీరా మూవీను చూస్తే త‌ల‌నొప్పి త‌ప్పితే మ‌రొక‌టి క‌నిపించ‌లేదు. ఈ మూవీ కూడ ప్రియ‌మ‌ణి న‌టించిన బిగ్ డిజాస్టర్స్‌ మూవీల‌లో ఒక‌టిగా చేరిపోయింది. తెలుగులో ప్రియ‌మ‌ణి చేతిలో మ‌రొక మూవీ ఉంది. ఆ మూవీపై కూడ ఎవ్వరికి అంత ఎక్స్‌పెక్టేష‌న్స్ లేదు. దీంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప్రియ‌మ‌ణి గుడ్‌బై చెప్పడం ఎంతో మేలు అని అంటున్నారు. ప్రస్తుతం ప్రియ‌మ‌ణి రెండు మ‌ల‌యాళం, ఒక క‌న్నడ ఫిల్మ్స్‌లో న‌టిస్తుంది. ప్రియ‌మ‌ణిను పెట్టుకుంటే మూవీ స‌క్సెస్ మాటను ప‌క్కన పెడితే, ఆ మూవీకు మొద‌టి నుండే నెగిటివ్ టాక్ సొంతం అవుతుంద‌ని నిర్మాత‌లు తెగ ఫీల్ అవుతున్నారు. మొత్తంగా చండీ మూవీ మీద ఆశ‌లు పెట్టుకున్న ప్రియ‌మ‌ణికు ఫెయిల్యూర్ చ‌విచూడ‌టంతో ఈమెను ప‌ల‌క‌రించి ఆఫ‌ర్స్ ఇచ్చేవారే క‌రువ‌య్యారంటూ టాలీవుడ్ అంటుంది. ఇక‌నైన లీడ్ రోల్స్‌ను ప‌క్కన పెట్టి, క‌నీరం క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటే కొద్దిగ అయినా సేప్‌గా ఉండొచ్చు అని ప్రియ‌మ‌ణికు స‌ల‌హాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: