శ్రీనువైట్ల,మ‌హేష్‌బాబు అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఆగ‌డు మూవీలో హీరోయిన్ ఎంపిక ఒక కొలిక్కి రావ‌డంలేదు. ఓకె అనుకున్న హీరోయిన్స్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబుకు సూట్ కావ‌డంలేదంటూ మ‌ళ్ళీ సెల‌క్ట్ చేసుకున్న హీరోయిన్స్‌కు నో చెప్పేస్తున్నారు. ఆగ‌డు మూవీలో త‌మ‌న్నా హీరోయిన్‌గా చేస్తుందంటూ శ్రీనువైట్ల స్వయంగా వెల్లడించాడు. శ్రీనువైట్ల చెప్పిన కొద్దిరోజుల‌కే త‌మ‌న్నను మార్చే అవ‌కాశం ఉందంటూ టాలీవుడ్‌లో టాక్స్ వినిపించాడు. కొంత కాలానికి అది ఇప్పుడు నిజ‌మైంది. ఆగ‌డు మూవీలో త‌మ‌న్న హీరోయిన్‌గా న‌టించ‌డంలేదంటూ అఫిషియ‌ల్‌గా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మ‌న్నకు సైతం డైరెక్టర్ శ్రీనువైట్ల వ‌ద్దని చెప్పాడంటూ టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. త‌మ‌న్న ఎంపిక‌లో మ‌హేష్‌బాబుకు తెలియ‌కుండానే శ్రీనువైట్ల నిర్ణయం తీసుకున్నాడ‌ని, అందులోనూ త‌మ‌న్న ప్రస్థుత ప‌రిస్థితుల్లో అంత‌గా స‌క్సెస్ రేటు ఉన్న హీరోయిన్ కాక‌పోవ‌డంతో త‌మ‌న్నను మార్చాల‌ని ప్రిన్స్, శ్రీనువైట్లకు డిటైల్‌గా చెప్పిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆగ‌డు మూవీలో త‌మ‌న్నకు చెక్ ప‌డింది. ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం వ‌న్ మూవీకు సంబంధించిన గోవా షెడ్యూల్‌లో ఉన్నాడు. ఈ షెడ్యూల్ నుండి తిరిగి వ‌చ్చిన త‌రువాత ఆగ‌డు మూవీలో అస‌లైన హీరోయిన్ ఎవ‌రు అన్నదానికై అధికారికంగా స‌మాచారం రావ‌చ్చని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: