యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ అటాక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఇటీవలే స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. యూరప్ లో తీసిన దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మిగిలి ఉన్న కొంత భాగాన్ని హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలైంది.స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: