కొంతమంది గొప్ప వ్యక్తులు చెప్పే విషయాలను బట్టి ఆ వ్యక్తులకు ఆ సంఘటనలకు లేదంటే ఆవస్తువులకు పేరు ప్రఖ్యాతలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మధ్య రాజమౌళి కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో తన విమానం గురించి ఎదురు చూస్తూ ఆ విమానం మూడు గంటలు ఆలస్యం అని తెలుసుకుని చేసే పనిలేక మన జక్కన్న ఎయిర్ పోర్ట్ లోని బుక్ స్టోర్స్ లోకి వెళ్ళాడట, అక్కడ ఉన్న రకరకాల పుస్తకాలను తిరగేస్తూ ఉంటే రాజమౌళి ద్రుష్టి ఒక ప్రముఖ రచయిత పుస్తకం పై పడింది. ఆ పుస్తకం ఎవరిదో కాదు ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ రాసిన ‘ది సన్ సెట్ క్లబ్’.  గాఫిక్ మాయాజాలంతో సినిమాలు తీయడంలో మన జక్కన్న ఎంత సిద్దహస్తుడో పుస్తకం పై చేయి వేసిన తరువాత ఆ పుస్తకాన్ని వదలకుండా చదివించే శైలి ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ ది. ఈ నవల కధ 80 సంవత్సరాల వయస్సు ఉన్న ముగ్గురు వృద్దుల చుట్టూ తిరుగుతుంది. ఆ వయస్సులో ఆ తరం వాళ్లకు వచ్చే సమస్యలు ప్రస్తుత సమాజంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను ద్ర్స్తిలో పెట్టుకుని రాసిన నవల అది. ఈ నవల పూర్తిగా చదివేసిన రాజమౌళి తనకు ఆ నవల ఎంతగానో నచ్చిందని ఈ మధ్య తన అబిమానులకు తెలుపుతూ ట్విట్ చేసాడు. ఇలాంటి మంచి నవలలను ఆదరించడమే కాదు మంచి కధలను చిన్న సినిమాలుగా తీస్తే ప్రస్తుత టాలీవుడ్ ను కుదిపేస్తున్న కోట్ల ఖర్చు తగ్గిపోతుంది అన్న విషయం పై రాజమౌళి లాంటి దర్శకులు మనసు పెడితే బాగుండు.  

మరింత సమాచారం తెలుసుకోండి: