నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తిరిగి ఫాంలోకి వ‌చ్చిన‌ట్టే అని టాలీవుడ్ అంటుంది. సింహా మూవీ త‌రువాత బాల‌య్య బాక్సాపీస్ హావా కొన‌సాగుతుంది. ప్రస్తుతం బాల‌కృష్ణ లెజెండ్ మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. లెజెండ్ మూవీ త‌రువాత బాల‌కృష్ణ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో న‌టించ‌బోతున్నాడు. సింగం మూవీ సీక్వెల్స్‌తో బాక్సాపీస్‌ను షేక్ చేయించిన డైరెక్టర్ హ‌రితో బాలయ్య జోడి క‌డుతున్నట్టు, త్వర‌లోనే దానికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డునున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకు సాయి కొర్రపాటి నిర్మాత‌గా వ్వవ‌రిస్తున్నాడ‌ని టాలీవుడ్ స‌మాచారం. ఏదేమైనా లెజెండ్ మూవీ త‌రువాత బాల‌య్య పూర్తి రాజ‌కీయాల్లోకి వెళ‌తాడు అని అభిమానులు నిరాశ ప‌డ్డారు. కాని బాల‌య్య అటు రాజ‌కీయాల‌తో పాటు, సినిమాల‌కు కూడ ప్రాముఖ్యత‌ను ఇస్తూ మూవీల‌ను తీస్తుంటే అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ హ‌రీ, బాల‌య్య కాంబినేష‌న్ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంద‌ని తెలుస్తుంది. మూవీ సెట్స్ మీద‌కు వెళ్ళేది మాత్రం 2014 ఎల‌క్షన్స్ త‌రువాతే అని అంటున్నారు. మొత్తానికి బాల‌కృష్ణ యాక్షన్ అవ‌తారంతో దుమ్ము దుల‌ప‌టానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: