టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాను నటించిన సినిమాల విజయం ఏమేరకు ఉంటుందో ముందుగానే ఉహించి అంచనాలు వేయగల దిట్ట అని అంటారు. బహుశా ఈపోలిక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుండి వచ్చినట్లు ఉంది. కృష్ణ కూడా తాను నటించే సినిమాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో ముందుగా ఉహించేవాడట. మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘దూకుడు’ ఘనవిజయాన్ని ముందుగానే ఉహించి అభిమానులు కోరుకునే బ్లాక్ బస్టర్ రాబోతోంది అంటు ఆ రోజులలో తన అభిమానులకు ముందుగానే ట్విట్ చేసాడు మహేష్. అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ క్రితం సంక్రాంతికి వచ్చిన ‘బిజినెస్ మేన్’ సినిమాలు సూపర్ హిట్ కాబోతున్నాయి అంటు ముందుగానే మహేష్ తన అభిమానులకు సంకేతాలు పంపాడు. ఇదంతా గతంలో జరిగిన విషయాలు అయితే ప్రస్తుతం మహేష్ కెరియర్ లో భారీ బడ్జట్ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1’ నేనొక్కడినే సినిమా చివరి షెడ్యుల్ కు వచ్చేసినా ఈ సినిమా గురించి మహేష్ ఇంతవరకు తన ట్విటర్ లో ఎటువంటి ట్విట్ చేయకపోవడం మహేష్ అభిమానులను కలవర పెడుతోందట. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు వ్యవధి ఉంది కాబట్టి మహేష్ కావాలని మౌనంగా ఉన్నాడా లేకుంటే దర్శకుడు సుకుమార్ చేస్తున్న ప్రయోగాలు చూసి తన అభిమానులకు ఏమి చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడా అని ఆలోచిస్తూ మహేష్ ట్విట్ కోసం కళ్ళు కాయలు కాసేలా మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: