తెలుగమ్మాయి అంటే అందరికీ సుపరిచితమే మర్యాద రామన్న సినిమాలో అచ్చమైనతెలుగింటి అమ్మాయిలా  కనబడుతుంది. చిత్రసీమలో అన్నిటికంటే అవకాశం గొప్పది అదే థీయరీని నమ్ముతుంది సలోని. మగదీర చిత్రంలో ఓ ప్రత్యేక పాట పై ఈ అమ్మడు తలక్కున మెరిసింది. ఆ తర్వాత రాజమౌళి చిత్రం మర్యాద రామన్న చిత్రంలో కథానాయికగా కనిపించింది. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత హీరోయిన లేడీ ఓరియంటెడ్ తీసిన తెలుగమ్మాయి సినిమాలో చక్కటి పర్ఫామెన్స్ కబరిచింది. ఈ తర్వాత బాలకృష్ణ సినిమా అధినాయకడు, వెంకటేశ్ తో బాడిగార్డ్ లో ఈ అమ్మడు చోటు దక్కించుకుంది.అంతేనా త్వరలో రాబోయే అల్లు అర్జున్ సినిమా రేసు గుర్రంలో కూడా నటించబోతున్నట్లు తెలిపింది అంతే కాకుండా ఈ చిత్రంలో తాను మరింత అందంగా కనబడబోతున్నట్లు సలోనీ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇందులో నేను కథను మలుపు తిప్పే కీలక పాత్ర పోషిస్తున్నాను. నటన ప్రదర్శించడానికి అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాల్లో గుర్తుపెట్టుకునే విధంగా పాత్ర ఉంటుంది. ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే నా కెరీర్ పరుగులు పెట్టిస్తుందని నమ్ముతున్నాను అంటుంది సలోని.

మరింత సమాచారం తెలుసుకోండి: