నందమూరి కుటుంబ యంగ్ టైగర్ నిజమైన సింహం ఆ కుటుంబ వారసత్వంగా వచ్చిన పౌరుషం జూనియర్ కు కూడా ఉంది. కానీ అటువంటి హీరోకు ఒక సినిమా నిర్మాత భవిష్యత్ భోదించాడు అనే వార్తలు ఫిలిం నగర్ లో వినపడుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తీస్తున్న సినిమా విషయంలోనే ఈ భవిష్యత్ భోధన జరిగిందని టాక్. సామాన్యంగా ఎవరి మాట వినని జూనియర్ సానుకూలంగా స్పందించారని ఫిలింగనర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాత బెల్లం కొండ సురేష్ తన సినిమా కధనం విషయంలో మార్పులు చేర్పులు అంటూ హడావిడి చేయవద్దని తన పాత్ర వరకూ జూనియర్ చూసుకుంటే ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఇస్తానని అటు నిర్మాతా, దర్శకుడు మాట ఇవ్వడంతో జూనియర్ మొట్టమొదటిసారిగా నిర్మాత చెప్పిన మాటలను ప్రశాంతంగా విన్నాడని ఫిలిం నగర్ టాక్. ‘రామయ్య వస్తావయ్య’ చిత్రం విడుదల తర్వాత అనుకోని భారీ ఫైల్యూర్ కు జూనియర్ షాక్ కు గురై 15రోజులు షూటింగ్‌ వాయిదా వేసుకున్నాడట. దాంతో ఎన్‌.టి.ఆర్‌.కు ధైర్యాన్ని ఇచ్చి, మంచి హిట్‌ ఇస్తామని చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ వార్తలకు తోడు నిన్న మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ మరొక సంచలన వార్త చెప్పాడు. త్వరలోనే జూనియర్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఎన్టీఆర్ అందుబాటులో ఉంటాడు అని చెప్పడం బట్టీ ‘రామయ్య’ పరాజయం జూనియర్ లో చాల మార్పు తెచ్చిందనే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: