ఇప్పటికే అల్లుశిరీష్ ద్వారా మెగా కాంపౌండ్ లోకి ప్రవేసించిన మారుతికి ఇప్పటి దాకా అల్లుఅర్జున్ తో సినిమా తీయడమే ధ్యేయం అనుకున్నారంత. కానీ ఈ మధ్య జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో మారుతీ తన లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించిన రహస్యం బయట పెట్టి అందరికీ నోటమాట రాకుండా చేసారు. అత్తారిల్లు సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లోని ప్రతి దర్శకుడు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటున్నాడు. సంవత్సరానికి ఒకటి తప్పితే రెండు సినిమాలు చేసే పవన్ ఇంతమంది కోరికలను తీర్చలేడని తెలిసినా తమ కలలలో పవన్ తో సినిమాలు తీస్తున్నట్లుగా ఉహించుకుంటున్నారు. ఈ లిస్టు లో దర్శకుడు మారుతీ కూడా చేరిపోయాడు. ఈ బూతు సినిమాల దర్శకుడికి పవన్ కళ్యాణ్ ను వెండితెర పై అన్యాయాలను ఎదిరించే లాయర్ గా చూడాలని ఉందట. దానికోసం ‘కొణిదెల ఎల్.ఎల్.బి.’ అనే టైటిల్ ను కూడా మనసులో అనుకోవడమే కాకుండా ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయిస్తాను అని అంటున్నాడు మారుతి. ఇప్పటివరకు పవన్ ను ఏ దర్శకుడు చూపించని విధంగా లాయర్ గా చూపెట్టి రికార్డులు బ్రేక్ చేయాలని మారుతి కోరిక. టైటిల్ రెడీ, కధ రెడీ, దర్శకుడు కూడ రెడీ పవన్ రెడీ అంటే చాలు డబ్బులు పెట్టడానికి క్యూలో ఉంటారు నిర్మాతలు. ఇంతకీ ఈ టైటిల్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: