సెక్సీ మోడ‌ల్ కం యాక్టెర్ వీనామాలిక్ ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వీనామాలిక్‌, త‌న ఫిల్మ్స్‌తో ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోతుంది. దీంతో నిరాశ చెందిన వీనామాలిక్‌, బాలీవుడ్‌లో స‌క్సెస్ కొట్టాలంటే ఏం చేయాలో, ఆ దారిని క‌నిపెట్టేసింది. రీసెంట్‌గా క‌ల‌కత్తా టూర్‌కి వ‌చ్చిన వీనామాలిక్‌, ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోస్ గురించి మాట్లాడింది. 'నాకు షారుఖ్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్‌లో న‌టించాలని లేదు. కాని వాళ్ళకు నా కంటే మంచి హీరోయిన్స్ దొర‌కటం చాలా క‌ష్టం' అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎందుకు మీ గురించి అంత‌లా పొగుడుకుంటున్నారు అన్న దానికి, వీనామాలిక్ త‌నలోని గొప్పద‌నాన్ని మీడియాకు చెప్పుకుంది. 'అంద‌రి హీరోయిన్స్‌లా నేను ఉండ‌ను. నా మూవీ స్టార్టింగ్ నుండి రిలీజ్ వ‌ర‌కూ సంబంధించిన అన్ని ప్రమోష‌న్స్‌లోనూ నేను చురుగ్గా పాల్గొంటున్నాను. అంతే కాకుండా మూవీ కోసం అంద‌రి హీరోయిన్స్ కంటే నేను ఎక్కువుగా హార్డ్ వ‌ర్క్ చేస్తాను. త‌రువాత మూవీ హిట్టో, ప్లాపో అన్నది ఆడియ‌న్స్ చేతిలో ఉంటుంది. అందుకే నేను బెస్ట్' అంటూ స‌మాధానం ఇచ్చింది. మొత్తానికి స‌ల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌ల‌ను బుట్టలో వేసుకోవటానికి వీనామాలిక్ ఈ విధ‌మైన ప‌బ్లిసిటి స్టంట్స్‌ను క్రియోట్‌ చేస్తుందంటూ బాలీవుడ్ అంటుంది. అంత‌లా వాళ్ళ మూవీలో న‌టించాలంటే ఐటెం సాంగ్ కోసం ప్రయ‌త్నించ వ‌చ్చు క‌దా, రాని హీరోయిన్ ఛాన్స్ కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవ‌డం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: