హీరో గోపీచంద్ ప్రస్తుత పరిస్థితిఫై ఫిలిం నగర్ లో రకరకాల సటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తాను కోరుకుంటున్న స్టార్‌ డైరెక్టర్లు ఎలాగూ తనతో పనిచేయరని తెలిసి పోయింది కాబట్టి తన సినిమాలకు సంభందించి మరో కొత్త మర్గాన్ని ఎంచుకున్నాడని టాక్. ఈమధ్య విడుదల అయి ఫరవాలేదు అని అనిపించుకున్న ‘సాహసం’ సినిమా తరువాత తన దగ్గరకు వస్తున్న నిర్మాతలతో ఎలాగు టాప్ దర్శకులు తన సినిమాకి దొరకడంలేదు కాబట్టి కనీసం స్టార్‌ హీరోయిన్లని అయినా తెమ్మని గోపీచంద్‌ నిర్మాతలకి స్పష్టంగా చెబుతున్నాడట. కనీసం టాప్ హీరోయిన్‌కి క్రేజ్‌ ఉంటే తన సినిమాకి హెల్ప్‌ అవుతుందని, తద్వారా స్టార్‌ డైరెక్టర్‌ లేని లోటు కాస్త తీరుతుందని గోపిచంద్ లేటెస్ట్ స్టాండ్ అట.  ఈ విధానాన్ని అనుసరించి ప్రస్తుతం బి.గోపాల్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నయనతారతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆమెకి భారీగా పారితోషికం ముట్టచెప్పారని టాక్‌. ఇప్పుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయబోతున్న గోపీచంద్‌ ఆ సినిమాకి ఏరి కోరి తమన్నాని హీరోయిన్‌గా పెట్టించుకున్నాడు. పెద్ద హీరోలతో నటిస్తున్న తమన్నా తన సినిమాలో ఉంటే క్రేజ్‌ ఎక్కువ ఉంటుందనేది గోపిచంద్ ఆశ. తమన్నా కు ఎలాగు మహేష్ బాబు దక్కే అవకాశాలు బాగా తగ్గిపోయాయి కాబట్టి మన మిల్కీ బ్యూటీ కూడా గోపీచంద్ తో సరిపెట్టుకుంటోంది అనుకోవాలి .  

మరింత సమాచారం తెలుసుకోండి: