ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ ఏంటంటే అదే 'వ‌ర్మ వ‌ర్సెస్ ధ‌న‌ల‌క్ష్మీ' అని చెబుతారు. డైరెక్టర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ గురించి పెద్దగా ఇంట్రడెక్షన్ అవ‌స‌రంలేదు. కాని ధ‌న‌ల‌క్ష్మీ అంటేనే కొద్దిగా చెప్పాలి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు మూవీ సెన్సార్ ఆఫీస‌ర్‌గా ధ‌న‌ల‌క్ష్మీ ప‌నిచేస్తున్నారు. మూవీకు సంబంధించిన ఫైన‌ల్ అవుట్‌పుట్ అయిన పోయిన త‌ర‌వాత చివ‌రిగా ధ‌న‌ల‌క్ష్మీ ద‌గ్గర‌కు ఆ మూవీ సెన్సార్ కోసం వ‌స్తుంది. అలా సెన్సార్ కోసం వ‌చ్చిన మూవీల‌ను ఒక సెన్సార్ ఆఫ‌స‌ర్ హోదాలో ధ‌న‌ల‌క్ష్మీ, నిర్మాత‌ల‌కు చుక్కలు చూపిస్తుంద‌ట‌. అలాగే రీసెంట్‌గా రామ్‌గోపాల్‌వ‌ర్మకు త‌న త‌డాఖా ఏంటో చూపించింది. రామ్‌గోపాల్‌వ‌ర్మ సైతం స‌త్యా2 మూవీ సెన్సార్ విష‌యంలో ఆమెను దాదాపు ప్రాధేయ ప‌డాల్సినంత ప‌ని జ‌రిగిందంటూ వాపోయాడు. ఒక్క వ‌ర్మనే కాదు చిన్న మూవీల నిర్మాత‌ల నుండి బ‌డా మూవీల నిర్మాత‌ల‌కు వ‌ర‌కూ ధ‌న‌ల‌క్ష్మీ ప‌నులకు విసిగివేసారిపోతున్నారు. ఒక టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో లైవ్ డిబేట్‌లో కూర్చున్న వ‌ర్మకు, మేము కూడ బాధితుల‌మే అంటూ చిన్న మూవీల నిర్మాత‌లు క్యూలు క‌ట్టారు. ఆ లైవ్ షోలో మోహ‌న్‌బాబు కూడ త‌న బాధ‌ను వ్వక్తప‌రిచాడు. వ‌ర్మకు మేము అండ‌గా ఉంటాం అందరూ భ‌రోస ఇచ్ఛారు. నిర్మాత‌ల పాలిట శ‌త్రువులా క‌నిపిస్తున్న సెన్సార్ ఆఫీస‌ర్ ధ‌న‌ల‌క్ష్మీను, వ‌ర్మ ఏవిధంగా ఎదుర్కొంటాడు అనేది ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగులుతుంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: