టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ ‘1’నేనొక్కడినే సినిమా సంక్రాంతి పండుగకు ముందుగానే జనవరి 10వ తారీఖున విడుదలకు సర్వం సిద్దం చేసుకుంటోంది. అత్యంత భారీ స్థాయి ధియేటర్ల సంఖ్యలో ఈ సినిమాను విడుదల చేసి ఓపినింగ్ కలెక్షన్స్ నుండి రికార్డును క్రియేట్ చేయడానికి ఈ సినిమా నిర్మాతలు ఇప్పటి నుండి దియేటర్ల ను బ్లాక్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రిన్స్ మహేష్ సినిమాతో మెగా కుటుంబానికి చెందిన చరణ్ సినిమా కానీ, లేదంటే బన్నీ సినిమా కాని పోటీగా నిలుస్తుందని ఇప్పటిదాకా అందరు అనుకుంటూ వచ్చారు.  అయితే ‘ఎవడు’ సినిమా నిర్మాత దిల్ రాజ్ తన సినిమా డిసెంబర్ 19వ తారీఖున సంబంధించి పబ్లిసిటీ కార్యక్రమాలు తిరిగి మొదలు పెడుతూ ఉండడంతో డిసెంబర్ లో ‘ఎవడు’ విడుదల ఖాయం అని అంటున్నారు. ఇకపోతే సురేంద్ర రెడ్డీ దర్శకత్వం వహిస్తున్న అల్లుఅర్జున్ ‘రేసుగుర్రాన్ని’ సంక్రాంతి రోజున విడుదల చేయడానికి ఆ సినిమా నిర్మాతలు పట్టుదల మీద ఉన్నారట. ఈ రెండు వార్తలు ఇలా వస్తూ ఉంటే నిర్మాత వై.వి.ఎస్. చౌదరి తాను ఎప్పటి నుంచో నిర్మిస్తున్న చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ భారీ బడ్జెట్ సినిమా ‘రేయ్’ సినిమాను కూడా సంక్రాంతికి తీసుకు వస్తానని ప్రకటించిన వార్తలను చూసిన టాలీవుడ్ ప్రముఖులు షాక్ అయిపోయారు. ఈ వార్తలను బట్టీ నిజంగా మెగా కుటుంబానికి చెందిన చరణ్, బన్నీ, సాయి ధర్మతేజ్ ల సినిమాలు అనుకున్న తేదీలకు ఖచ్చితంగా వస్తే మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలతో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమన్యుడి లా యుద్ధం చేయవలసి వస్తుందని, అయినా ప్రస్తుతం మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా మెగా కుటుంబ హీరోలు అంత సాహసం చేస్తారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: