సినిమా మొదలవడానికి టైటిల్స్ పడినట్టు... రిలీజ్ దగ్గర పడిందని చెప్పడానికి ఆడియోను రిలీజ్ చేస్తుంటారు మనోళ్లు. ఒకప్పుడు ఈ అలవాటు లేదు. కానీ కొంత కాలంగా ఆడియో వేడుకలను అట్టహాసంగా చేస్తున్నారు. ఆ చిత్ర టీమ్ తో పాటు ఇతర పరిశ్రమ పెద్దలు, స్టార్స్ వచ్చి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించి మరీ వెళ్తుంటారు. అందుకే ఆడియో వేడుక అనేది అది పెద్ద ఈవెంట్ అయిపోయిందిప్పుడు. మహేశ్ బాబు కూడా తన సినిమా ఆడియో వేడుకకి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైపోయిన నేనొక్కడినే సినిమాని ఎలాగైనా సంక్రాతికి విడుదల చేయాలన్న లక్ష్యంగా గబగబా షూట్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆడియో వేడుకను నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా... నందమూరి నాయకుడు బాలయ్య. అవును. నేనొక్కడినే ఆడియో రిలీజుకు ముఖ్య అతిథిగా బాలకృష్ట వస్తున్నాడట. మహేశ్ బాబు వేడుక అంటే సూపర్ స్టార్ కృష్ణ ఎలాగూ ఉంటారు. ఆయనతో పాటు ఈసారి బాలయ్య బాబు కూడా అలరించనున్నాడన్న మాట. అయితే దీని గురించి ఆ చిత్ర వర్గం గానీ, బాలయ్య గానీ ఇంతవరకూ చెప్పలేదు. కానీ ఈ వార్త ఇప్పటికే ఫిల్మ్ నగర్ అంతటా బాగా చక్కర్లు కొడుతోంది. బాలయ్య రాక వెనుక మరో కారణం కూడా ఉందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. బాలయ్యకీ జూనియర్ ఎన్టీయార్ కీ చెడింది కాబట్టి... మహేశ్ ని మంచి చేసుకుని అతణ్ని, అతడి ఫ్యాన్స్ ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని బాలయ్య ప్లాన్ అంటున్నారు కొందరు. కానీ ఇది అయ్యే పని కాకపోవచ్చు. మామూలు విషయాలనే అంతగా పట్టించుకోని మహేశ్, పాలిటిక్స్ జోలికి వస్తాడంటే నమ్మడం కాస్త కష్టమే. మరి బాలయ్య మనసులో ఏముందో!

మరింత సమాచారం తెలుసుకోండి: