త‌న పాట‌ల‌తో సంగీత ప్రియుళ్ళను ఉర్రూత‌లూగించిన గాయ‌ని గీతామాధురి పెళ్ళిబాజా బాగా త్వర‌లోనే మోగ‌నుంది. 'మగాళ్లు ఒట్టి మాయగాళ్లు', 'పరవాలేదు...', 'రాయె రాయె సలోని' లాంటి గీతాలతో యువ శ్రోతలను ఆకట్టుకొన్న గాయని గీతామాధురి. నందు అనే యువ నటుణ్ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. 'ఫొటో' చిత్రంతో నందు హీరోగా తెరంగేట్రం చేశాడు. తరువాత కొన్ని సినిమాలు చేసినా, నాగ‌చైత‌న్య '100% లవ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% మూవీలో తమన్నాను ప్రేమించే యువకుడిగా నందు నటించాడు. అందులోని అజ‌య్ పాత్రతో నందు పేరు టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యింది. గ‌త కొద్ది కాలంగా వీరిద్దరూ ప్రేమ‌లో ఉన్నార‌ని టాలీవుడ్‌లో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. 'అదితి' అనే లఘు చిత్రంలో నందు, గీతామాధురి కలిసి నటించారు. అప్పుడు మొదలైన వీరి స్నేహం ఇలా ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇరువైపుల పెద్దలకీ చెప్పి పెళ్లికి అనుమతి తీసుకున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటో ఒక‌టి అంద‌రికి ఇవ్వడం జ‌రిగింది. ఇంకేముంది త్వర‌లోనే టాలీవుడ్‌లో ఓ గాయ‌ని పెళ్ళి మేళాలు వినిపించ‌బోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: