ఈ మ‌ధ్య కాలంలో అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస మూవీల‌ను చేస్తున్నాడు. ప్రత‌స్తుతం ఆటోన‌గ‌ర్ సూర్య మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా, ఓ వైపు అక్కినేని ప్యామిలి చిత్రం మ‌నం మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మూవీ మొఘ‌ల్ డాక్టర్‌.డి.రామానాయుడు కూడ నాగ‌చైత‌న్యతో ఓ మూవీను తీయ‌టానికి సిద్ధమ‌య్యాడు. మూవీ మొగల్ డా. డి రామానాయుడు తన మనవడు అక్కినేని నాగ చైతన్య కోసం ఒక కొత్త సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమా పంజాబీ సినిమా ‘సింగ్ వర్సెస్ కౌర్’ కి రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. పంజాబీ వర్షన్ లో ఈ సినిమాని డా రామానాయుడు గారే నిర్మించారు. ఇందులో గిప్పీ గ్రేవల్, సుర్వీన్ చావ్లా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. రామానాయుడు నిర్మించిన ఈ పంజాబీ మూవీనే ఇప్పుడు తెలుగులో మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్యతో తెర‌కెక్కించాల‌ని కోరుకుంటున్నాడు. తెలుగులో నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటించవచ్చునని బావిస్తున్నారు. తెలుగు వర్షన్ లో కూడా ఈ సినిమాని మంచి కామెడీ, ఎంటర్టైనర్ గా నిర్మించే అవకాశం వుంది. దీనికి సంబంధించిన ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంకా ఈ మూవీకు సంబంధించిన డైరెక్టర్‌,మ్యూజిక్ డైరెక్టర్‌ల‌తో పాటు ఇత‌ర టెక్నిక‌ల్ విభాల‌కు సంబంధించిన స‌మాచారం కూడ త్వర‌లోనే తెలియ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: