వర్మకి కోపమొస్తే మామూలుగా ఉండదు. సాధారణంగా ఏదో ఒకటి మాట్లాడి ఆయనే అందరికీ కోపం తెప్పిస్తుంటాడు. తను మాత్రం కూల్ గా ఉంటాడు. కానీ అప్పుడప్పుడూ అతడికి కూడా కోపమొస్తుంది. వస్తే ఎలా ఉంటుందో ధనలక్ష్మిని అడిగితే తెలుస్తుంది. తన సినిమా సెన్సార్ విషయంలో విసిగించిందంటూ అధికారిణి ధనలక్ష్మిపై మండిపడ్డాడు వర్మ. ఆమెపై కేసు కూడా పెట్టేందుకు సిద్ధపడ్డాడు. సినీ పరిశ్రమలోని చాలామంది అతడికి అండగా నిలబడ్డారు. ఆమె వల్ల ఇబ్బందిపడ్డ మోహన్ బాబు లాంటి వాళ్లు చాలామంది ధనలక్ష్మి కొమ్ములు వంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. వీళ్లందరి కోపం ఒకెత్తు. వర్మ కోపం ఒకెత్తు. అతడు ధనలక్ష్మి పేరు చెబితేనే ఫైరయిపోతున్నాడు. నా సినిమాలో ఏముందని ఇంత చేసింది, ఆవిడ వల్ల నేను చాలా నష్టపోయాను, దానికి నాకు న్యాయం చేయాల్సిందే అంటున్నాడు. అలా అని ఊరుకుంటే వర్మ ఎందుకవుతాడు? ఓ లా పాయింటు లాగాడు. అరుంధతి సినిమాలో ఒక అమ్మాయిని విలన్ కత్తితో పొడుస్తాడు, రక్తపు మడుగులో ఉన్న ఆమెపై అత్యాచారం జరుపుతాడు, ఇలాంటి రేప్ సీన్లు తప్పు కాదు గానీ నా సినిమా తప్పయ్యిందా అంటూ విరుచుకుపడ్డాడు వర్మ. ఉరుమురిమి మంగలం మీద పడినట్టు... పోయి పోయి అరుంధతి సినిమా మీద పడ్డాడేంటో!

మరింత సమాచారం తెలుసుకోండి: