గుణశేఖర్ చారిత్రాత్మక డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి సినిమాకు సంబంధించి ఒక హాట్ న్యూస్ ఈరోజు ఉదయం నుంచి ఫిలింనగర్ లో తెగ వినిపిస్తోంది. గుణశేఖర్ తన సొంత బేనర్ పై అనుష్కను రుద్రవదేవిగా చూపెడుతూ తీస్తున్న సినిమా చిత్రీకరణ దాదాపు సగంపైగా పూర్తి అయింది. ఈ మధ్యనే అనుష్క పుట్టినరోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే మళ్ళీ ఈ సినిమాలో మహేష్ బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు గుప్పు మంటున్నాయి. గోన గన్నారెడ్డిగా మహేష్ ను చూపించాలని గుణా శేఖర్ చేస్తున్న ప్రయత్నాలకు చిట్టచివరికి మహేష్ ఓకె అన్నాడు అనే వార్తలు విశ్వసనీయంగా తెలియ వస్తోంది.  కొన్ని నెలల క్రితం ఈ వార్తలు టాలీవుడ్ లో వచ్చినా ఆ తరువాత ఈ వార్తల గురించి అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు మహేష్ డేట్స్ కూడా ఇచ్చాడని ప్రచారం ఫిలింనగర్ లో విపరీతంగా జరుగుతోంది. ఈ డీల్ సెట్ కావడానికి మహేష్ గుణశేఖర్ ల మధ్య టాలీవుడ్ లోని ఒక ప్రముఖ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడని అదేవిధంగా మహేష్ కు ఈ పాత్ర నిమిత్తం భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసాడని ప్రచారం విపరీతంగా జరుగుతోంది. అంతేకాదు డిసెంబర్లో మహేష్ ఈ సినిమా షూటింగులో పాల్గోననున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలే నిజమైతే టాలీవుడ్ లో ఒక అద్భుతం జరిగిందనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: