ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత భారీ సినిమా అయినా ఆ సినిమా వివాదాల నడుమ కాకుండా మాములుగా విడుదలైతే జనం చూసే పరిస్థుతులలో లేరు అని అంటున్నారు విశ్లేషకులు. సినిమా బాగుండి దానికి వివాదాలు తోడైతే ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా మిగులుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా పవన్ ‘అత్తారిల్లు’ సినిమాను టాలీవుడ్ పండితులు చుపెడుతున్నారు. అత్తారింటి సినిమాకు పైరసీ మీద ఆగ్రహం సినిమాకు ఉప్పెనలా కలెక్షన్స్ వచ్చి పడ్డాయి. .ఈ పరిస్థుతుల నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న ‘ఎవడు’, ‘1’ నేనొక్కడినే, ‘విక్రమ సింహ’ లాంటి భారీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా మిగలాలి అంటే కేవలం టివిలలో వరుసపెట్టి యాడ్స్ వేసుకుని ఊదర కొట్టినంత మాత్రాన ఉప్పెనలా భారీ ఓపెనింగ్స్ రావని 50 నుంచి 100 కోట్ల స్థాయిలో నిర్మించపడ్డ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా మారాలి అంటే ఈ సినిమాలకు కూడా ఎదో ఒక వివాదం ఉండాలని లేదంటే ఆ సినిమాల నిర్మాతలే ఎదో ఒక వివాదం సృష్టించు కోకుండా మాములుగా విడుదల చేస్తే సినిమాలు విజయం సాధించవచ్చు కానీ టాలీవుడ్ రికార్డులను తిరగ రాసే బ్లాక్ బస్టర్స్ మారడం కష్టం అని అంటూ ఒక ఆలోచనాత్మకమైన విశ్లేషణలు చేస్తున్నారు మన టాలీవుడ్ పండితులు. మహేష్, రామ్ చరణ్, రజనీకాంత్ ల కెరియర్లకు అతి ముఖ్యమైన సినిమాలుగా మారబోతున్న ఈ మూడు భారీ సినిమాలకు ఏ వివాదాల ఉప్పెన వచ్చి బ్లాక్ బస్టర్ గా మారుస్తుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: