ఒకప్పుడు ముద్దు సీన్లు గమ్మత్తుగా తీసేవారు. హీరో హీరోయిన్లు దగ్గరగా రావడం, వారిద్దరి ముఖాలకూ ఓ పూలగుత్తినో అడ్డుపెట్టి, వాళ్లు ముద్దాడినట్టు కలరింగ్ ఇవ్వడం చేసేవారు. ఆ తర్వాత హీరో చిన్నగా ఓసారి హీరోయిన్ పెదవులను తన పెదవులతో తాకింది వదిలేసేవాడు. కానీ ఇప్పుడు ముద్దు హద్దు దాటింది. ఆంగ్ల సినిమాల మాదిరి సెకన్లు, నిమిషాల పాటు కొనసాగేంత పెద్దదయ్యింది. లిప్ కిస్ అన్నమాట మనది కాదు, దానితో మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమ. కానీ ఇప్పుడు అది అందరికీ అలవాటైన పదం అయిపోయింది. మన సినిమాల సంగతేమో గానీ... బాలీవుడ్లో ముద్దుల కోసం కొట్టుకు చస్తున్నారు. మా సినిమా మాంచి ముద్దు సీన్ ఉందని ఒకరంటే, మా దాంట్లో ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేనంత ఎక్కువసేపు లిప్ లాక్ సీన్ ఉంటుందంటూ మరొకరు గొప్పలు పోతున్నారు. మొన్నటి వరకూ దీన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ... రామ్ లీలా సినిమా పుణ్యమా అని ముద్దులకి సమయం మూఢింది. ఈ సినిమాలో ఏకంగా రెండు నిమిషాల పాటు రణవీర్, దీపికా పదుకొనేలు ముద్దాడుకునే సీన్ తీశాడట సంజయ్ లీలా భన్సాలీ. చేసినవాళ్లు బాగానే ఉన్నారు. తీసినవాళ్లూ బాగానే ఉన్నారు. కానీ చూసిన సెన్సార్ వాళ్లకు మాత్రం మండింది. అందుకే ముద్దు మీద యుద్ధం ప్రకటించారు. త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సీన్లు లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారట సెన్సార్ బోర్డు వారు. రామ్ లీలా సినిమా విషయంలో చాలా వివాదాలు రేగాయి. ఇది హిందూ మతాన్ని అవమానపరిచేలా ఉందంటూ వాదనలు మొదలయ్యాయి. వాటిని సరి చేయలేకే తిప్పలు పడుతుందటే... అంతలో ఈ ముద్దుసీను వివాదం రేగింది. దాంతో ఇకమీదల ఇలాంటి వాటికి అనుమతినివ్వకూడదని సెన్సార్ బోర్డు డిసైడ్ చేసేసుకుంది. పాపం రసికులైన ప్రేక్షకులు ఈ వార్త విని ఇప్పట్నుంచే బెంగ పెట్టేసుకున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: