బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక పదుకొనేను టాలీవుడ్ డైమండ్ లెగ్ హీరోయిన్ సమంత వెనకేసుకోచ్చింది. డ్రెస్సులను మార్చినట్లుగా దీపిక తన బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తోంది అంటూ ‘దీపికా బాయ్ ఫ్రెండ్స్’ పేరిట బాలీవుడ్ లో ఒక ప్రముఖ ఛానల్ ఈ మధ్య ఒక కధనాన్ని ప్రచారం చేసింది. ఈ కధనాన్ని బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంతా తెగ ఎంజాయ్ చేసారట. ఆ ప్రోగ్రామ్ ను మిస్ అయిన కొంతమంది హీరోయిన్స్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ను చూసి తెగ ఎంజాయ్ చేసారట.  ఈ కధనం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్న దీపిక చాలా ఘాటుగా ప్రతిస్పందించింది. తనకు నచ్చిన ఒక బాయ్ ఫ్రెండ్ తో తిరిగినంత మాత్రాన అది శారీరక సంబంధమేనా అంటూ ఎదురు దాడికి దిగడమే కాకుండా సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన తనను ఇలా అశ్లీలంగా చిత్రీకరిస్తూ ప్రసారంచేసిన వార్తలకు తాను విలువ ఇవ్వనని తన పై కధనాలు ప్రసారం చేసే మీడియా వర్గాలు బాయ్ ఫ్రెండ్ అనే పదానికి అర్ధం తెలుసుకోమంటు మీడియాకు హితబోధ చేసింది.  ఈ వార్త పై మన దక్షణాది హీరోయిన్స్ ఎవరూ ప్రతిస్పందించకపోయినా మన సమంత మాత్రం దీపికను వెనకేసుకు వస్తూ దీపికను గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సమంత దీపిక పదుకొనెను ఉద్దేశించి తన ట్విట్టర్లో.. దీపిక పదుకొనె ఏం చేసినా, ఏం మాట్లాడినా పర్‌ఫెక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించింది. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ విషయంపై దీపిక చెప్పిన అభిప్రాయాలతో తాను ఎకీభావిస్తున్నానని అని కూడా స్పష్టం చేసింది. దీపిక లాగే సమంతకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి దీపిక బాధ సమంతా పూర్తిగా అర్ధం చేసుకుంది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: