ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స్ అధ‌ర‌గొడున్నాయి. ఇది అంద‌రి నోటా నుండి వినిపిస్తున్న మాట‌. అయితే ఇప్పటి వ‌ర‌కూ ఎంత క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది అనేదానిపై ఓ క్లారిటి లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే అత్తారింటికిదారేది స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియోట్ చేస్తుంద‌నేది ఎంత నిజ‌మో, ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టగ‌ల‌దా అనేది కూడ అంతే డౌట్ అని టాలీవుడ్ అంటుంది. ప్రస్తుతం యాభై రోజుల‌కు చేరువలో ఉన్న ఈ మూవీ క‌లెక్షన్స్ అన్ని క‌లుపుకొని తొంభై కోట్ల రూపాయ‌ల లోపే ఉన్నాయి. ఓ వైపు టాలీవుడ్‌లో బ‌డా ఫిల్మ్స్‌, చోటా ఫిల్మ్స్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటి తాకిడితో అత్తారింటికి దారేది క‌లెక్షన్స్, చిన్నగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అత్తారింటికిదారేది మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లో హెచ్‌.డి క్యాలిటీలో పైరేటెడ్ వీడియో అంద‌రికి అందుబాటులోకి రావ‌డంతో, థియోట‌ర్ల వ‌ద్ద రిపీటెడ్ ఆడియన్స్ త‌గ్గుముఖం ప‌ట్టింది. మూవీ ఎంత బాగున్నా, అంత క్యాలీటి వీడియోను ఇంట్లో పెట్టుకొని థియోట‌ర్‌కు వెళ్ళి చూడ‌లంటూ ఎవ్వరికి సాధ్యం కాని ప‌నిగా ఉంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికిదారేది మూవీ వంద కోట్ల క‌లెక్షన్స్‌ను ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండ‌గా, ఇప్పట‌కీ ఆ లెక్క తేలేదెప్పుడో ఎవ్వరికి అర్ధం కాకుండా ఉంది. ఇక‌నైన అత్తారింటికి దారేది మూవీ ఒరిజిల్‌ క‌లెక్షన్స్ వివ‌రాల‌ను ఎంత వ‌ర‌కూ వ‌చ్చాయో బ‌య‌ట‌కు చెబితే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. వంద‌కు చేరువ‌లో ఉంటే అభిమానులే ఆ లెక్కను రౌండ్ ఫిగ‌ర్ చేసేలా ప‌బ్లిసిటిను పెంచుతారు. ఇది కూడ వంద కోట్ల టార్గెట్‌కు రీచ్ అవ్వటానికి కొంత మేర ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: