ఈ రోజుల్లో అంద‌రికి వెబ్‌సైట్స్ అనేవి కామ‌న్‌గా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎవ‌రికి వారు, ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారి పేర్లతో వెబ్‌సైట్స్‌ను పెట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇది ఫిల్మ్ సెల‌బ్రిటీస్‌లో స్టేట‌స్ సింబ‌ల్‌గా మారుతుంది. ఆ విధంగానే మ‌న టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి బాల‌వుడ్ వ‌ర‌కూ ఫేమ‌స్ ఫిల్మ్ సెల‌బ్రిటీల‌కు, వారి పేరు మీద వెబ్‌సైట్ ఉంటుంది. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికాప‌దుకొనె కూడ త‌న పేరుతో వెబ్‌సైట్‌ను పెట్టాల‌నుకుంది. అయితే ఇది ఇప్పుడు వ‌చ్చిన ఆలోచ‌న కాదు. గ‌త రెండు సంవ‌త్సరాల క్రిత‌మే త‌న పేరుతో ఓ వెబ్‌సైట్‌ను పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌న్నమాట‌. రీసెంట్‌గా దానికి సంబంధించిన ప‌నుల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేయాల‌ను కుంది. ఇంకే ముంది త‌న పేరుతో డొమైన్‌ను సెర్చ్ చేసిన అభిమాన సంఘం, ఆమె పేరుతో డొమైన్ ఇప్పటికే ఎవ‌రో రిజిస్టర్ చేసుకున్నారంట‌. త‌ను ఎవ‌రో తెలుసుకొని త‌న వ‌ద్దకు వెళితే, ఆ పేరు కావాలంటే మూడు కోట్ల రూపాయ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఫైనల్‌గా రెండు కోట్ల రూపాయ‌ల‌కు ఇచ్చేస్తాన‌ని చెప్పాడంట‌. ఈ విష‌యాలు తెలుసుకున్న దీపికా అవాక్కయింది. దాదాపు నా ఒక్క మూవీ రెమ్యున‌రేష‌న్ అంత అమౌంట్‌ చెబుతున్నాడు. లైట్ తీసుకోండి అంటూ అభిమాన సంఘానికి చెప్పింది. ఇప్పటికే త‌న‌కు 'దీపికాప‌దుకొనె.కో.ఇన్' అనే పేరు మీద వెబ్ సైట్‌. కాని త‌న‌కు ఆ డొమైన్ న‌చ్చక వేరే సైటును కోరుకోడంతో ఈ విష‌యం తెలుసుకొని ఇక పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: