కోళీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్కెర్లు కొడుతుంది. హీరో ధ‌నుష్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ధ‌నుష్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ అయితే ఈ న్యూస్‌లో పెద్ద వింతేమి లేదు. అంత స‌న్షేష‌న్ అంత‌కంటే లేదు. కాని ధ‌నుష్ మ‌ల్టీస్టార్ ఫిల్మ్‌లో మ‌రో హీరో త‌న మామ‌గారే. అంటే ర‌జ‌నీకాంత్‌. ర‌జ‌నీకాంత్‌,ధ‌నుష్ కాంబినేష‌న్‌లో త్వర‌లోనే ఆ ఫిల్మ్ ప‌ట్టాలెక్కబోతుంద‌ని అంటూ కోళీవుడ్‌లో ఈ న్యూస్ చ‌క్కెర్లు కొడుతుంది. ఈ మూవీకు ధ‌నుష్ ఇప్పటికే సైన్ చేశాడ‌ని, అందుకు ర‌జ‌నీకాంత్ కూడ ఓకె అన్నాడ‌ని కోళీవుడ్‌లో వినిపిస్తుంది. ఈ మూవీకు డైరెక్టర్ ఆనంద్ ద‌ర్శక‌త్వ బాధ్యత‌ను తీసుకున్నాడు. ధ‌నుష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ రాంజ్‌నాకు ఆనంద్ డైరెక్టర్‌గా ఉన్నారు. బాలీవుడ్‌లో రాంజ్‌నా మూవీ సూప‌ర్ స‌క్సెస్‌ను అందుకోవ‌డంతో డైరెక్టర్ ఆనంద్‌తో ధ‌నుష్ సంబంధాలు మ‌రింత ద‌గ్గర‌గా మారాయి. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ 2014లో సెట్స్ మీద‌క వెళ్ళనుంద‌ని కోళీవుడ్ టాక్‌. రిలీజ్ కూడ అదే సంవ‌త్సరంలోనే ఉంటుంద‌ని కోళీవుడ్ చెబుతుంది. ఇదిలా ఉంటే, ఈ మేట‌ర్‌లో ఏ మాత్రం నిజం లేద‌ని కొంద‌రు బ‌లంగా చెబుతున్నారు. రాంజ్‌నా డైరెక్టర్‌తో ధ‌నుష్ రెండో మూవీ ఉంది కాని, అది ఈ మ‌ల్టీస్టారర్ ఫిల్మ్ కాద‌ని తేల్చి చెబుతున్నారు. ర‌జ‌నీకాంత్‌కు మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌లో న‌టించాల‌ని లేద‌ని, ఇది కావాల‌నే ఎవ‌రో గాసిప్ క్రియోట్ చేసి తెగ ప్రచారం చేస్తున్నార‌ని అంటున్నారు. ఒక వేళ ఇద్దరూ క‌లిసి న‌టిస్తే ఎవ్వరికి అభ్యతంరం లేదుకాని, ప్రస్తుతానికి మాత్రం వీరిద్దరూ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌లో న‌టించ‌డం లేద‌ని అడిగిన వాళ్ళకు అభిమాన సంఘాలు క్లారిటి ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: