ఎప్పుడు చాలా సీరియస్ గా ఉండే తెలుగు దేశం అధినేత చంద్రబాబు తన పద్ధతి మార్చి నవ్వుతు నిన్న జరిగిన ‘ప్రతినిధి’ ఆడియో వేడుకలో అందరిపైన సెటైర్లు వేయడం నిన్న ఆ కర్యక్రమానికి వచ్చిన చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇక వివరాలలోకి వెళితే హీరో నాని నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ మంచి స్నేహితుడని చెపుతూ తామిద్దరం గతంలో సనత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన కుర్చుని చాలా కబుర్లూ, కధలూ చెప్పుకున్నామని అంటూ అలాంటి స్నేహితుడు ప్రవీణ్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి అతదికోసమే ఈ ఆడియో వేడుకకు వచ్చానని చెపుతూ తన స్నేహితుడు ప్రవీణ్ ఫస్ట్ టైమ్ పెళ్ళి చేసుకోబోతున్నాడని వ్యాఖ్యానించాడు.  దీనికి నానీ పక్కన కూర్చున్న చంద్రబాబునాయుడు నవ్వుతూ స్పందిస్తూ పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే అలాంటిది ఫస్ట్‌టైమ్‌ పెండ్లి చేసుకోబోతున్నాడని హీరో నాని అనడం ఆశ్చర్యంగా ఉందని నారాచంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కుటుంబ విలువలు అందరు గౌరవిస్తారని అని అంటూ అలాంటి విలువలను తాను గౌరవిస్తాను అని అంటు అమెరికాలో 18 ఏళ్ళకే ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఎప్పుడోగానీ, తల్లిదండ్రుల్ని చూడడానికి రారు. అక్కడ భార్య, భర్త విడివిడిగానూ ఉంటారు. 'అవర్‌ చిల్డ్రన్‌. యువర్‌ చిల్డ్రన్‌ ఈజ్‌ మై చిల్డ్రన్‌' అనేది అక్కడ పాలసీ. కానీ మనది విలువలగల దేశం. దాన్ని మనం కాపాడాలి అని అంటు తాను ఎప్పుడూ విలువలకు గౌరవం ఇస్తా అని చెపుతూ ప్రస్తుత యువతరం కూడా అలాగే ఉండాలని సూచిస్తూ ఫస్ట్ మేరేజ్, సెకండ్ మేరేజ్ అనే పదాలు వాడద్దని హీరో నానీకి చంద్రబాబు చురక అంటించారు  దీనితో నాని ఆ మాటలు తత్తరపాటుతో అలా అన్నానని చంద్రబాబుకు వివరణ ఇచ్చు కున్నాడు. ఈ మాటలు విన్న వారంతా ఆనందంగా నవ్వుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: