క్రిష్‌3 మూవీ బాక్సాపీస్ క‌లెక్షన్స్ రోజు రోజుకి సునామిలా దూసుకు వెళుతున్నాయి. దీపావ‌ళికి కానుక‌గా రిలీజ్ అయియి క్రిష్‌3 మూవీ ఇప్పటి వ‌ర‌కూ 261 కోట్ల రూపాయల‌ క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది. క్రిష్‌3 మూవీకు మొదటి రోజు వ‌చ్చిన టాక్‌ను చూస్తే ఈ మూవీకు బాక్సాపీస్ క‌లెక్షన్స్ రావ‌డం క‌ష్టం అని బాలీవుడ్ క్రిటిక్స్ తేల్చేశారు. కాని ప్రస్తుతం ఈ మూవీ సాధిస్తున్న క‌లెక్షన్స్‌ను చూస్తుంటే అంద‌రూ ఆశ్ఛర్యప‌డుతున్నారు. న‌వంబ‌ర్ 1న రిలీజ్ అయిన క్రిష్‌3 మూవీ నవంబ‌ర్ 13న నాటికి డొమెస్టిక్ మార్కెట్లో 221.23 కోట్ల రూపాయ‌ల క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది. న‌వంబ‌ర్ 12న ఈ మూవీ అయిదు కోట్ల రూపాయ‌ల‌ను కొల్లగొట్టింది. అలాగే న‌వంబ‌ర్ 13న కూడ అయిదు కోట్ల రూపాయ‌ల‌కు మించి క‌లెక్షన్స్‌ను సాధించింది. రిలీజ్ అయిన అయిదో రోజే ఈ మూవీ 35.6 కోట్లను కొట్లను కొల్లగొట్టి రికార్డ్‌ను క్రియోట్ చేసింది. ప‌ద‌మూడు రోజుల ఇండియా మార్కెట్ క‌లెక్షన్స్ 221.23 కోట్ల రూపాయ‌లు కాగ‌, ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ప‌ద‌మూడు రోజుల క‌లెక్షన్స్ 261 కోట్ల రూపాయ‌లుగా తేలింది. 200 కోట్ల రూపాయ‌ల క్లబ్‌లో చేరిన మూడో సినిమాగా క్రిష్‌3 నిలిచింది. మొద‌టి మూవీ త్రి ఇడియ‌ట్స్‌, త‌రువాత చెన్నై ఎక్స్ ప్రెస్‌, మూడోది క్రిష్‌3. ఇప్పటి వ‌ర‌కూ అతి వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన మూవీగా షారుఖ్ న‌టించిన చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే చెన్నైఎక్స్‌ప్రెస్ వంద కోట్ల రూపాయ‌ల క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: