పెద్ద కొడుకు నాగ చైతన్య విషయంలో చాలా ప్లాన్లు వేశాడు నాగార్జున. బోలెడన్ని కథలు పరిశీలించి, బోలెడంత మంది దర్శకులను పరిశీలించి మరీ ఎంట్రీకి స్కెచ్ వేశాడు. ఏమయ్యింది? సీన్ సితారయ్యింది. జోష్ సినిమా అంత సక్సెస్ కాలేదు. అసలు అబ్బాయిగారే క్లిక్ కాలేదు. మళ్లీ ఇప్పుడు అఖిల్ విషంలో స్కెచ్చులేయడం మొదలెట్టాడు నాగ్. అఖిల్ ఎంట్రీ గురించి రోజుకోవార్త వినబడుతోంది. అలా వస్తాడు, ఆ దర్శకుడితో వస్తాడు, ఆ హీరోయిన్ తో నటిస్తాడు... ఒకటే చర్చలు. కానీ కొడుకు రూటు ఇప్పటికీ క్లియర్ చేయడం లేదు నాగ్. రాజమౌళి దగ్గర్నుంచి మారుతి వరకూ అందరి పేర్లనూ పరిశీలించేస్తున్నాడు. ఎవరి చేతుల మీద ఎంటర్ చేద్దామా అని ప్లాన్ల మీద ప్లాన్లు వేసేస్తున్నాడు. కానీ వాటిలో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా అఖిల్ మొదటి సినిమా గురించి మరో వార్త వచ్చింది. సచిన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాలని, అఖిల్ తో సచిన్ పాత్ర చేయించాలని నాగ్ ఉవ్విళ్లూరుతున్నాడని తెలిసింది. సచిన్ రిటైరవుతున్నందున ఎక్కడ చూసినా అతడి పేరే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగ్ కు ఈ ఆలోచన వచ్చిందని అంటున్నారు. అఖిల్ చాలా మంచి క్రికెటర్ అని మనకు తెలిసిందే కదా. ఒకవేళ ఆ సినిమా చేస్తే చిన్నోడు చక్కగా ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. అందులో డౌటే లేదు. కానీ దీనినయినా నాగ్ వర్కవుట్ చేస్తాడని నమ్మకం ఏముంది! చివరికి చూసి చూసి జనాలకు కూడా విసుగొచ్చేస్తోంది. స్కెచ్చులేస్తే చాలా నాగ్, కొడుకు ఎంట్రీకి ఇక ముహూర్తం పెట్టు అంటున్నారు. వింటున్నావా నాగ్!

మరింత సమాచారం తెలుసుకోండి: