హీరోయిన్ అన్నాక అటు అందమైనా ఉండాలి, ఇటు టాలెంట్ అయినా ఉండాలి. రెండూ ఉన్నవాళ్లకే దిక్కు లేదు. అలాంటిది ఏదీ లేకుండా ఏదో చేసేద్దామంటే నిరాశ వాళ్లకి, చిరాకు ప్రేక్షకులకి మిగులుతుంది. ఇదంతా ఎవరి గురించి అనేగా? మసాలా చిత్రంలో నటించిన అమ్మడి గురించి. రూబా రూబా అంటూ రామ్ చరణ్ వెంట పడుతుంటే చిలిపిగా నవ్వులు విసిరిన షాజన్ పదమ్ శీని అప్పుడు అందరూ బాగుందన్నారు. కానీ తర్వాత ఎవరూ పిలిచి అవకాశం ఇవ్వలేదు. దాంతో బిచాణా ఎత్తేసింది. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా అంతగా కలసిరాక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ గడిపేస్తోంది. అలాంటిదాన్ని పనిగట్టుకుని పట్టుకొచ్చారు మనవాళ్లు. మసాలా సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా చేసేందుకు షాజన్ ను ఎంచుకున్నాడు విజయభాస్కర్. కానీ ఆమెను ఎందుకు తీసుకొచ్చాడో ఆయనకే తెలియాలి. సినిమా చూసినవాళ్లంతా ఈమె తప్ప ఎవరూ దొరకలేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నటన రాదు, గ్లామరూ లేదు, ఎందుకు తీసుకున్నట్టు అంటూ చిరాకు పడుతున్నారు. ఆమె నటించిన ఒక్క సీన్ కూడా రక్తి కట్టకపోవడంతో ఆమె సినిమాకు మైనస్ అని తేల్చేశారు. ఇలాంటివి జరిగినప్పుడైనా మనవాళ్లు పుల్లకూర కోసం పొరుగింటి మీద పడటం మానేయాలని తెలుసుకోవడం లేదు. చక్కటి ప్రతిభ ఉన్న మన అమ్మాయిలను వదిలేసి, గోళ్లు గిల్లుకుంటున్నవాళ్లయినా ఫర్వాలేదని పరాయి భాషల వాళ్లను తెచ్చుకుంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్లే మూటగట్టకోవాల్సి వస్తుంది మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: