పవన్ మ్యానియాతో పవన్ కళ్యాణ్ పై వార్తలు లేకుండా మీడియా ఉండటం లేదు. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వార్తలు రాయద్దు అని పవన్ కోరుతున్నా, ప్రతి రోజు వస్తున్న వార్తలలో పవన్ ప్రస్తావన్ లేకుండా వార్తలు రావడంలేదు. దీనిని బట్టి ప్రజలకు పవన్ వ్యక్తిగత జీవితం పై ఎంత ఆశక్తి ఉందో అర్ధం అవుతోంది. లేటెస్ట్ గా పవన్ తన ‘అత్తారిల్లు’ సినిమా సూపర్ హిట్ తరువాత తన భార్య రేణు దేశాయ్, కొడుకు అఖిరా నందన్, కూతురు ఆద్య తో కలిసి ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య పవన్ రేణు దేశాయ్ తో విడిపోయాడు అంటూ వార్తలు రావడం సంచలనం సృష్టించింది. ఈ వార్తల నేపధ్యంలో రేణు దేశాయ్ ఒక మరాఠీ సినిమాను నిర్మించడం ఆమె పూనాలో ఉంది అంటూ వార్తలు రావడంతో పవన్ రేణుల మధ్య బందంపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి. ఈ వార్తలు ఇలా ఉండగానే లేటెస్ట్ గా పవన్ తన భార్యా బిడ్డలతో ఒక ఫారిన్ ట్రిప్ చుట్టేసి వచ్చాడు అంటు వార్తలు రావడం పవన్ సన్నిహితులకు అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా చాలా ఆనందాన్ని కూడా కలిగించింది. మరొక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే పవన్ తన పిల్లలను వదిలి ఉండలేకపోతున్నాడని అందువల్ల పవన్ రేణులు త్వరలోనే మీడియాకు గ్రూఫ్ ఫోటో ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు. ఆ వార్తే నిజమైతే పవన్ అభిమానులకు పండుగే.   

మరింత సమాచారం తెలుసుకోండి: