పెళ్ళి బంధాన్ని ఒక్కసారిగా కామెడీ చేసింది. అసలు ఈమెకు పెళ్ళి అంటే ఇష్టమో లేదో తెలియ‌దు కాని, ఇండియాలో జ‌రిగే పెళ్ళి బంధాన్ని మాత్రం త‌ను కామెడీ చేసింది. ముఫ్పై ప‌దుల వ‌య‌స్సు ఉన్న క‌త్రినాకైఫ్ త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ ధూమ్‌3 మూవీ ప్రమోష‌న్స్‌లో పాల్గొంది. క‌త్రినా కైఫ్‌తో పాటు, అమీర్‌ఖాన్ కూడ ఆ ప్రమోష‌న్‌లో పాల్గొన్నాడు. ఇందులో క‌త్రినాకైఫ్‌ను పెళ్ళి గురించి స్వయంగా అమీర్‌ఖాన్ అడిగాడు. త్వర‌గా పెళ్ళి చేసుకోవ‌చ్చు క‌దా అని అడ‌గ‌టంతో క‌త్రినాకైఫ్ పెళ్ళి టాపిక్ హైలెట్‌గా నిలిచింది. స్వయంగా అమీర్‌ఖాన్ ఆ విధంగా అడ‌గ‌టంతో క‌త్రినాకైఫ్ కూడ ఉలిక్కిప‌డింది. ఇక స‌మాధానాన్ని దాట‌వేయ‌కుండా త‌న‌తో పాటు, మీడియా ప్రతినిధులంద‌రికి కూడ స‌మాధానాన్ని చెప్పుకుంది. నిజానికి నాకు పెళ్ళి చేసుకునే ఉద్ధేశం లేద‌ని, త‌ను ఇంకా అటువంటి ఆలోచ‌న‌లు చేయ‌డం లేద‌ని చెప్పికుంది. అలాగే నేను ఇంకా ఇండియాలోని పెళ్ళి బంధాల‌కు అంత ద‌గ్గర‌ కాలేదంటూ చెప్పుకొచ్చింది. క‌త్రినాకైఫ్ చెప్పిన స‌మాధానానికి అక్కడ ఉన్న ఎవ్వరూ కూడ ఇంకో ప్రశ్నను వేయ‌లేదు. ఎందుకంటే త‌ను చెప్పిన మాటల్లో పెళ్ళి కంటే లివింగ్ రిలేష‌న్స్‌పైనే ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంద‌ని తెలుస్తుంది. ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో త‌న పెళ్ళి ఉంటుంద‌ని అనుకున్న బాలీవుడ్‌కు పెళ్ళి లేదు, ఏమి లేదు అంటూ త‌న మాటల్తో స‌మాధానం చెప్పింది. ప్రస్తుతం క‌త్రినాకైఫ్ మ‌రో నాలుగు మూవీల్లో న‌టిస్తుంది. రిలీజ్ కాబోతున్న ధూమ్‌3 ప్రమోష‌న్ కోసం తెగ తిరుగుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: