అనునిత్యం తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ భజనచేసే రాంగోపాల్ వర్మ తన రూట్ ను మార్చాడు. హీరోలను తన బుట్టలో పడేసుకోవడంలో వర్మ స్పెషలిస్ట్ అని అంటారు. అందుకే వరసగా ఫ్లాప్ లు వస్తున్నా చాలమంది హీరో లు వర్మను భలేనమ్ముతుంటారు. తాజాగా ఆలిస్టులో మంచువిష్ణు చేరిపోయాడు ప్రస్తుతం వర్మ విష్ణు కథానాయకుడిగా ఓ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథ, చర్చలు సాగుతున్నాయి అని టాక్. ఈనెల20న ఈ సినిమా విషయాన్ని అధికారికం గా ప్రకటిస్తారట. `దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` సినిమాలతో వరస విజయాలు సొంతం చేసుకున్న విష్ణు తాజాగ మంచు వారి కుటుంబ చిత్రం `పాండవులు పాండవులు తుమ్మెదా` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది అని అంటున్నారు. ఈ సినిమా తరువాత వెను వెంటనే రామ్ గోపాల్ వర్మతో సినిమా మొదలుపెట్టాలని మన మంచు వారి అబ్బాయి ఆలోచిస్తున్నాడట. ఇప్పటి దాకా వర్మ మాఫియా సినిమాలు, దెయ్యం సినిమాలు తీయడం చూసాం. తన లేటెస్ట్ సినిమా ‘సత్య 2’ కూడా ఫెయిల్ అవ్వడంతో ఇక లాభం లేదు అనుకుని వర్మ చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా వర్మ తన దృష్టిని పవన్ నుండి విష్ణు ఫైకి మరిల్చాడు అని అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: