బలమైన బ్యాగ్రౌండుతో ఎంట్రీ ఇచ్చినవారిలో సోనాక్షి సిన్హా దూసుకెళ్లినంత ఫాస్టుగా ఎవరూ దూసుకెళ్లలేదేమో. ఎందుకంటే సోనమ్ కపూర్, ఆలియా భట్, పరిణీతి చోప్రా, శ్రద్ధా కపూర్, శృతీహాసన్ లాంటి వాళ్లంతా స్ట్రాంగ్ బ్యాగ్రౌండు ఉన్నవాళ్లే. కానీ వాళ్లింకా బాలీవుడ్లో సెటిలవడానికి తంటాలు పడుతూనే ఉన్నారు. కానీ సోనాక్షి మాత్రం నంబర్ వన్ స్థాననానికి చేరువలో ఉంది. బహుశా సల్మాన్ ఖాన్ తో ఎంట్రీ ఇవ్వడం సోనాక్షికి కలిసి వచ్చిందేమో అంటారు కొందరు. అది నిజమే కావచ్చు కానీ... ఆమె ఈ స్థాయికి చేరుకుంది మాత్రం స్వశక్తితోనే. ఆమె టాలెంట్ ఉన్న నటి. దానికితోడు కమిట్మెంట్ ఎక్కువని దర్శకులు అంటూ ఉంటారు. అందుకే ఆమె అంత త్వరగా సక్సెస్ అయ్యింది. ప్రతిభకు తోడు మంచి ప్రవర్తన కూడా ఉంది సోనాక్షికి. అందరికీ మర్యాద ఇవ్వడం, అనవసర విషయాల్లో వేలు పెట్టకపోవడం వంటివి ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అవకాశాలను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ఐదారు చిత్రాలు చేస్తోంది సోనాక్షి. ఇది ఇలాగే కొనసాగితే ఆమె త్వరలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతందని అంటున్నారు. అయితే, తనకలాంటి ఆశలేమీ లేవంటోంది సోనాక్షి. అసలు హీరోయిన్ అవ్వాలని, అవుతానని అనుకోలేదు. ఏదో అయ్యాను. ఎప్పటివరకూ నటనను ఎంజాయ్ చేయగలనో అప్పటివరకూ చేస్తాను, కిక్కు తగ్గాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అంటోంది. అలా చేయకమ్మా తల్లీ! నిన్ను నమ్ముకున్న నిర్మాతలు, నిన్ను ఆరాధించే అభిమానుకు అల్లాడిపోతారు!

మరింత సమాచారం తెలుసుకోండి: