ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఇద్దరూ టాలీవుడ్‌లో టాప్ హీరోలే. వీరిద్దరికి టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రిన్స్ మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్దరిలో ఎవ‌రు నెంబ‌ర్ వ‌న్ అంటే అంద‌రూ కొద్ది స‌మయం ఆలోచిస్తే కాని స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ రిజ‌ల్ట్ యావ‌రేజ్ అని వ‌చ్చినా, త‌న ప్రతి ఫిల్మ్ రిలీజ్‌కు ఎక్కడ‌లేని ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఫిల్మ్ రిలీజ్ అంటే బాక్సాపీస్ క‌లెక్షన్స్ షేక్ అవ్వాల్సిందే. గ‌బ్బర్‌సింగ్‌, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, లేటెస్ట్‌గా అత్తారింటికిదారేది మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద టాప్ ఓపెనింగ్ క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. అలాగే ప్రిన్స్ మ‌హేష్‌బాబు కూడ ఈ సంవ‌త్సరం సీత‌మ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు మూవీతో బాక్సాపీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్ క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఆ మ‌ల్టీస్టార‌ర్ మూవీ త‌రువాత ఇదే సంవ‌త్సరంలో రిలీజ్ కావాల్సిన ఒన్ మూవీ 2014లో రిలీజ్ అవుతుంది. అత్తారింటికిదారేది మూవీ బాక్సాపీస్ క‌లెక్షన్స్‌తో ప‌వ‌న్ టాలీవుడ్ నెంబ‌ర్ పొజిష‌న్‌ను కైవ‌సం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఆ రికార్డ్స్‌ను బీట్ చేస్తాడా, లేదా అనేది టాలీవుడ్ టాపిక్‌గా మారింది. సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న వ‌న్ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీ కూడ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. వ‌న్ మూవీ బాక్సాపీస్ క‌లెక్షన్స్‌ను ఏ విధంగా వ‌సూల్ చేస్తుందో అన్నదానిపైనే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ఆధార‌ప‌డి ఉంది. బ్రాండ్ అంబాసిడ‌ర్స్ ప‌రంగా ప్రిన్స్ నెంబ‌ర్ వ‌న్ కాబ‌ట్టి, టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద నెంబ‌ర్ వ‌న్ ఎవ‌ర‌నేది ఇప్పటి ప్రశ్న అని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: