ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ప్రతి ప్రముఖ రాజకీయ నాయకుడి వెనుక ఒకో ఛానల్ దన్నుగా పనిచేస్తోంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పటి వరకు మా నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ చానల్ లో తనపట్టును నిలుపుకున్న మెగా పొలిటికల్ స్టార్ చిరంజీవి ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుతో కలిసి ఒక న్యూస్ చానల్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు అని అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులలో తులసి సీడ్స్ రామచంద్ర గుంటూరు జిల్లలో ప్రస్తుత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తో పోటి చేసి ఒడి పోయారు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉన్న రామచంద్ర ప్రస్తుతం చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలో కోసగుతున్నారు. మద్రాస్ ఐ .ఐ . టి . లో మేకానికల్ ఇంజనీరింగ్ చేసిన రామచంద్రకు చిరంజీవితో కలిసే న్యూస్ ఛానల్ పెట్టాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందట.  ప్రస్తుతం రాష్ట్రంలో 19 న్యూస్ చానెల్స్ ఉన్న నేపధ్యం లో ఈ న్యూస్ ఛానల్ ను చాలా వినూత్నంగా తీర్చిదిద్దాలని చిరంజీవి ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఛానల్ రాబోయే జనవరి 26 నుండి ప్రారంభం అవుతుందని టాక్. చిరంజీవి రాజకీయ భవిష్యత్ కు ఈ ఛానల్ ఎంత వరకు ఉపకరిస్తోందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: