సెలెబ్రిటీలను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు అభిమానులు. తమ అభిమాన నటి/నటుడిని అనుకరించడం, అనుసరించడం అదో ఆనందం వారికి. అందుకే సెలెబ్రిటీలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తమని వేయి కళ్లు గమనిస్తూ ఉంటాయి కాబట్టి, తమ ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండాలి. కొందరు అలానే ఉంటారు. కానీ కొందరు మాత్రం తప్పటడుగులు వేస్తుంటారు. తాగి కారు నడుపుతూ తెలుగు నటుడు రాజారవీంద్ర పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అయితే ఇలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. ఎమ్మెల్యే కాలనీలో చెకింగులు చేస్తోన్న పోలీసులుకు ఓ కారును ఆపితే అందులో నిత్యమీనన్ ఉందట. పరీక్షించగా ఆమె తాగేసి ఉన్నట్టు అర్థమైందట పోలీసులకు. మాలిని 22 ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన నిత్య, అలా తాగేసి రాత్రిపూట కారులో చక్కర్లు కొట్టడం చూసి పోలీసులు షాకయ్యారట. నిత్యకు చిన్న క్లాస్ పీకబోగా... కారులో ఉన్న ఆ చిత్ర దర్శకురాలు పోలీసులకు రివర్స్ లో క్లాస్ పీకారని సమాచారం. నిత్య కూడా ఒక బడాబాబుకి ఫోన్ చేసేందుకు రెడీ అవడంతో పోలీసులు సైలెంటుగా సైడైపోయారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా వట్టి కట్టు కథ అనేవారు కూడా ఉన్నారు. గతంలో కూడా విమానం కాక్ పిట్లో ప్రయాణం చేసి ఉద్దరు పైలెట్ల ఉద్యోగాలు పోవడానికి నిత్య మీనన్ కారణం అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. సంచలనం సృష్టించిన ఆ సంఘటన నిత్యను ఇమేజ్ ను బాగానే డ్యామేజ్ చేసింది అప్పట్లో. అయితే ఆమె మాత్రం అది తాను కాదని, తానసలు ఆ సమయంలో ప్రయాణమే చేయలేదని కన్ ఫామ్ చేయడంతో నిత్యకు సంబంధం లేదని తేలింది. ఇది కూడా అలాంటి ఓ పుకారే అయి ఉంటుంది అంటున్నారు కొందరు. నిప్పు లేనిదే పొగ రాదు. ఏదో ఒకటి జరగనిదే వార్తా రాదు. మరి ఈ వార్తలో నిజానిజాలు ఏమిటన్నది నిత్యకి, సదరు పోలీసులకే తెలియాలి. హీరోయిన్లు నిషాలో పోలీసులకు చిక్కడం అనేది ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. గతంతో త్రిషలాంటి కొందరు టాప్ స్టార్స్ విషయంలో కూడా ఇది జరిగింది. మరి నిత్య మ్యాటర్ లో నిజమెంతో!

మరింత సమాచారం తెలుసుకోండి: