తెలుగు టెలివిజ‌న్ రంగంలో జెట్ స్పీడ్‌తో దూసుకు వ‌చ్చిన సెక్సీ యాంక‌ర్ అన‌సూయ‌. ముఖ్యంగా జ‌బ్బర్‌ద‌స్థ్ యాంక‌ర్ అన‌సూయ అంటే అంద‌రికి తెలిపోతుంది. త‌న హావాభావాల‌తో జ‌బ్భర్‌ద‌స్థ్ కామెడీ షోను ప‌రుగులు పెట్టించిన అన‌సుయ‌కు, ఫిల్మీ ఆఫ‌ర్స్ కూడ ఆమె కాళ్ళ వ‌ద్దకు వ‌చ్చాయి. అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాలు క‌దా, ఎక్కడిపోతాయిలే అని లైట్ తీసుకుంది. ఇంకేముంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు అన‌సూయ ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది. సాక్షాత్తు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంత‌టి మూవీలో ఓ చిన్న పాటి పాత్ర వ‌స్తే, దాన్ని కాద‌నుకొని అంద‌రిని ఆశ్ఛర్యప‌రిచింది. నాకు ఇంకా చాలా స‌మ‌యం ఉందంటూ తెగ క‌బుర్లు చెప్పింది. తీరా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్‌ను అందుకున్నాక‌, అయ్యే అంటూ నాలుక క‌రుచుకుంద‌ట‌. ఇప్పుడ‌కేమో ఆఫ‌ర్ల కోసం సినిమా క‌ష్టాలు ప‌డుతుంది. ఏదైన మూవీలో చిన్నపాటి పాత్రయినా చాలు, చించుకుంటాను అంటూ ప్రొడ్యూజ‌ర్స్ ద‌గ్గర‌కు త‌న ప్రపోజ‌ల్స్‌ను తీసుకుపోతుంది. అంద‌రూ స‌రే చూద్ధాం అంటూ, తీరా ఆఫ‌ర్స్ లేవంటూ అన‌సూయ‌ను ఆవాక్కయ్యేలా చేస్తున్నారంటా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌న్నది ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సూత్రం. ఈ లాజిక్కును అన‌సూయ ఎలా మిస్సయిందా అని అంద‌రూ ఆమెకు గుర్తుచేస్తున్నారంట‌. ప్రస్తుతానికి అన‌సూయ ఓ టీవి షోను చేసుకుంటూ, ఫిల్మ్ అవ‌కాశాల కోసం తెగ ప్రయాత్నాల‌ను చేస్తుంది. ఎవ‌రు ఈమెను క‌రుణిస్తారో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: