ఈవారం భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ‘వర్ణ’ సినిమాపై చాల భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. టాప్ హీరోల సినిమాలతో సమానంగా ఈసినిమాను నవంబర్ 22న 1200 వందల దియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంతో పాటు నాగచైతన్య 'ఆటో నగర్ సూర్య' ట్రైలర్ ని ఎటాచ్ చేసి పంపుతున్నారని టాక్.  ఈ వీకెండ్ లో ఈ చిత్రం ట్రైలర్ చైతు సినిమా ‘ఆటోనగర్ సూర్య’ ట్రైలర్ అఫీషియల్ గా విడుదల చేసి ఆ ట్రైలర్ ను ధియేటర్ ట్రైలర్ గా ‘వర్ణ’ చిత్రంతో కలిపి ప్రేక్షకులకు చూపెడితే ఈ చిత్రానికి క్రేజ్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. అందులోనూ ‘వర్ణ’ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో ఓపినింగ్స్ బాగుంటాయని దానికి ఈ ట్రైలర్ కలిపితే వర్కవుట్ అవుతుందని నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్‌ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. చాలారోజుల క్రితం ఆగిపోయిన ఈ సినిమాకు 'తడాఖా' హిట్‌ తరువాత జీవం వచ్చింది. నాగార్జున ఈ సినిమాపై వ్యక్తిగత శ్రద్ద తీసుకుని తనకు కలిసివచ్చిన డిసెంబర్ నెలలో 27 న ఈ చిత్రం ప్రేక్షకులకు అందించేలా నాగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసాడు అని వార్తలు వినపడుతున్నాయి.  అనుష్కకు మొదటిలో టాలీవుడ్ లో కెరియర్ బ్రేక్ ఇచ్చినది నాగార్జున అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం టాప్ హీరోల ఇమేజ్ రేంజ్ కి సమానంగా ఎదిగిపోయిన అనుష్క ‘వర్ణ’ తో కలిసి వస్తున్న చైతు సినిమా ట్రైలర్ కు ఎంతటి పబ్లిసిటీ తీసుకు రాగలుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: