ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు వ‌చ్చిన రెండు సంవ‌త్సరాల‌కు శృతిహాస‌న్ స‌క్సెస్ బాట ప‌ట్టింది. ఇప్పుడు శృతిహాస‌న్‌లో చేతిలో ఉన్నవి అన్ని క్రేజీ ఫిల్మ్సే. అటు హిందీ ఫిల్మ్స్, ఇటు తెలుగు ఫిల్మ్స్, మ‌ధ్యలో కోళీవుడ్ ఇండ‌స్ట్రీను మేనేజ్ చేస్తూ శృతిహాస‌న్ అస్సలు తీరిక‌లేని స‌మ‌యాన్ని గ‌డుపుతుంది. త‌న షూటింగ్ షెడ్యూల్స్ అంతా టూర్‌ల‌తోనే సరిపెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే శృతిహాస‌న్, త‌న హాట్ లుక్స్‌తో మ‌రింత రెచ్చిపోతుంద‌ని బాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. త‌ను న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'వెల్‌కంబ్యాక్' లో శృతిహాస‌న్ బికిని లుక్స్ ఉన్నాయంటూ ప్రముఖ బాలీవుడ్ ఎంట‌ర్‌టైన్ టెలివిజ‌న్‌లోనూ న్యూస్ వినిపిస్తుంది. వెల్‌కం బ్యాక్ మూవీలో శృతిహాస‌న్, జాన్ అబ్రహం స‌ర‌స‌న న‌టిస్తుంది. జాన్ అబ్రహం అంటే మూవీలో హాట్ ఫోజ్‌ల‌తో అమ్మాయిల‌ను చిత్తు చేస్తాడు. ఇత‌డితో పోటీగా ఉండాలంటే, కొన్ని సీన్స్‌లో హీరోయిన్‌కు బికిని కంప‌ల్సరి అని అంటున్నారు. ఈ విష‌యాన్ని మూవీ చివ‌రి వ‌ర‌కూ కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచుదాం అనుకుంటే, ఈ మేట‌ర్ బాలీవుడ్‌లో ముందుగానే లీక‌య్యింది. అనీజ్ బాజ్మీ దర్శకత్వంలోరూపొందుతున్న ఈ 'వెల్కం బ్యాక్' మూవీ కొద్ది రోజుల్లోనే దుబాయ్ షెడ్యూల్‌కు రెడీ అవుతుంది. దుబాయ్‌లో మ్యాగ్జిమం మూవీ పూర్తవుతుంద‌ని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ మూవీలో శృతిహ‌స‌న్ బికిని ఉంద‌ని తెలుసున్న బాలీవుడ్‌, శృతిహాస‌న్ హాట్ లుక్స్‌పై ఫోక‌స్ చేసి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: