టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో మొద‌టి వ‌రుస‌లో త్రివిక్రమ్ ఉంటాడు. రీసెంట్‌గా త‌ను డైరెక్ట్ చేసిన అత్తారింటికిదారేది మూవీతో త్రివిక్రమ్ ఫుల్ డిమాండింగ్ ఉన్న డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్ రెమ్యున‌రేష‌న్ రౌండ్ ఫిగ‌ర్‌తో క‌ల‌పుకొని ప‌ది కోట్ల వ‌ర‌కూ వెళ్ళింది. త‌ను చిన్న మూవీలు తీసేందుకు, అలాగే చిన్న హీరోల‌తో తీసేందుకు కూడ సిద్ధంగా లేడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో త్రివిక్రమ్ రెమ్యున‌రేష‌న్‌పై హాట్ టాపిక్ న‌డుస్తుంది. త్రివిక్రమ్‌కు ఓ బ‌డా నిర్మాత దాదాపు ప‌దిహేను కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంత అమౌంట్‌ను త్రివిక్రమ్‌కు ఇచ్చి, ఆ నిర్మాత ఏ హీరోతో మూవీను తీస్తాడు అని డౌట్ వ‌చ్చిందా ? ఆ నిర్మాత ఏ హీరోతో మూవీను తీయాలో ఇంకా ఫిక్స్ కాలేదు. కాని త్రివిక్రమ్ కాల్షీట్ కోసం మాత్రమే అంత అమౌంట్‌ను ఆఫ‌ర్ చేశాన‌ని చెబుతున్నట్టు టాలీవుడ్ స‌మాచారం. ఒక్కసారిగా త్రివిక్రమ్‌కు అంత బిగ్ అమౌంట్‌ను ఆఫ‌ర్ చేయ‌టంతో ఇండ‌స్ట్రీ అంతా అవాక్కయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎక్కువ మూవీల‌ను చేయ‌టం కంటే, టాలీవుడ్‌కు మంచి మూవీల‌ను అందించాల‌నే ఉద్ధేశంతోనే ప‌ని చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ అంటుంది. అందుకే త్రివిక్రమ్ కాల్షీట్స్ కోసం ఓ నిర్మాత అంత ఆతృత ప‌డుతున్నాడ‌ని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాత త్వర‌లోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో మూవీను తీసేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని, ఓ విధంగా చూసుకుంటే త్రివిక్రమ్‌ను మ‌రో యాంగిల్ సెట్ చేసుకునేందు ఎన్టీఆర్ ఈ విధ‌మైన ప్రయ‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: