ఫిల్మ్ సెల‌బ్రిటీస్‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అభిమానుల‌ను ఏ విధంగా సంతోష పెడితే బాగుంటుంది అనేదానిపై సెల‌బ్రిటీలు కూడ విప‌రీతంగా ఆలోచిస్తారు. ఎప్పుడు వీల‌యితే అప్పుడు అభిమానుల‌కు ఏది కావాలో స‌ర్వే చేయించుకొని మ‌రీ, ఆ విధ‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తారు. కాని ఓ పాప్ సెల‌బ్రిటి మాత్రం అభిమానుల‌కు పిచ్ఛ కిక్కును ఇచ్చే పని ఒక‌టి చేసింది. 20 సంత్సరాల పాప్ స్టార్ మిల్లి సైర‌స్ ఓ ప్రమోష‌న్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది. ఈవెంట్‌ను ముగించుకున్న మిల్లిసైర‌స్‌, అభిమానుల‌కు ఓ ఛాన్స్ ఇచ్చింది. ఇది త‌న‌కు తానుగా ఇచ్చిన ఛాన్స కాదు. మిల్లి సైర‌స్‌కు స్మోక్ చేయ‌టం అలవాటు. ప‌బ్లిక్ ప్లేసెస్‌లోనూ మిల్లి స్మోక్ చేస్తుంటుంది. అయితే త‌న అభిమానులు కూడ మిల్లిసైర‌స్‌తో క‌లిసి స్మోక్ చేసేందుకు ఇష్టప‌డ్డారు. ఆ ఈవెంట్‌కు వ‌చ్చిన మిల్లిను అభిమానులు అదే అడిగారు. మేము మీతో క‌లిసి స్మోక్ చేస్తాము అని. ఇంకేముంది, షో అయిపోయిన త‌రువాత మిల్లి సైర‌స్‌, అభిమానుల‌తో క‌లిసి స్మోక్ చేసింది. ఇప్పుడు ఈ టాపిక్‌ హాలీవుడ్‌లో హైల‌ట్‌గా నిలిచింది. మిల్లి సైర‌స్ ఈ విధంగా చేయటం ఇదే మొద‌టిసారి కాదు. త‌ను గ‌తంలోనూ చేసిన షోల‌లో కొంత మంది అభిమానుల‌తో క‌లిసి స్మోక్ చేసే అల‌వాటు ఉంది. కాని ఇప్పుడు మాత్రం అంద‌రితో క‌లిసి స్మోక్ చేసింది. అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇవ్వడంతో మిల్లిసైర‌స్ మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. ఎందుకంటే త‌ను ఎప్పుడైనా న్యూడిటి వీడియోను రిలీజ్ చేసిందంటే, అందులో ముందుగా చెప్పే మాట 'ఇది ఫ్యాన్స్ ఫ‌న్ కోస‌మే' అని అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: