సెలెబ్రటీలు అనగానే వాళ్లను చాలా స్పెషల్ గా చూస్తుంటారంతా. వాళ్లు ఏం తింటారు, ఏం వేసుకుంటారు, ఖాళీ సమయాల్లో ఎలా గడుపుతుంటారు అంటూ ప్రతి విషయాన్నీ తెలుసుకోవడానికి ఉబలాటపడుతూ ఉంటారు. నిజానికి వాళ్లు కూడా మనుషులే. వాళ్లు కూడా అందరిలానే జీవిస్తుంటారు. వారికీ అందరిలాంటి ఇష్టాలే ఉంటాయి. కావాలంటే శృతీ హాసన్ ని అడగండి. కమల్ కూతురు శృతి సినిమాల్లోనే స్పెషల్ గా ఉంటుంది. మేకప్ తీసేస్తే అతి మామూలుగా బతుకుతుంది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. కాస్త తీరిక దొరికితే శృతి ఏం చేస్తుందో తెలుసా? చక్కగా పడుకుని, దుప్పటి ముసుగేసుకుని టీవీ చూస్తుందట. అసలామెకి టీవీ అంటే పిచ్చి అట. అదీ ఇదీ అని ఉండదు, ఏది వచ్చినా చూసేస్తుందట. అన్ని చానళ్లూ కవర్ చేస్తాను, అన్ని ప్రోగ్రాములూ చూసేస్తాను, ఎంత సేపు టీవీ చూసినా బోరన్నదే కొట్టదు నాకు అంటోంది. చివరకు యాడ్స్ కూడా వదలదట. అన్నిటినీ కంఠతా పట్టేస్తుందట. అయితే అన్నీ చూసినా... హారర్ ప్రోగ్రాములు, సీరియల్స్, సస్పెన్స్-యాక్షన్ థ్రిల్లర్స్ అంటే మహా ఇష్టమట మేడమ్ కి. సైన్స్ ఫిక్షన్స్ కూడా పిచ్చిగా చూస్తుందట. అమెరికన్ టీవీ సిరీస్ ఎక్స్-ఫైల్స్ శృతి ఫేవరేట్ ప్రోగ్రామట. అన్ని సిరీస్ నీ చూసేసిందట. ఆమె మాటలు వింటే భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! సినిమాలతో వీళ్లకు తీరికే ఉండదు. బహుశా తీరిక దొరికితే ఫుల్లుగా రెస్టు తీసేసుకుంటారు, నిద్దరోతారు అనుకుంటాం మనం. కానీ శృతిని చూశారుగా ఎంత టీవీ పిచ్చి ఉందో. ఒకవేళ సినిమాల్లేకపోతే అమ్మాయిగారు హ్యాపీగా టీవీకి వెళ్లిపోతారేమో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: