మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలంతా ఆయన సూపర్ హిట్ సినిమాలలోని పాటలను రీమిక్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. హీరో రామ్ చరణ్ కు ఈ సెంటిమెంట్ బాగా కలిసి రావడంతో ఆ కుటుంబానికి చెందిన మిగతా హీరోలు కూడా ఇదే పనిలో ఉన్నారు. కొత్తగా ఈ లిస్టులో అల్లు శిరీష్ కూడా చేరిపోయాడు. శిరీష్ మొట్టమొదటి సినిమా ‘గౌరవం’ సూపర్ ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుని పట్టువదలని విక్రమార్కుడిలా మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ఇప్పుడు 'కొత్త జంట' అనే ప్రయోగం చేస్తున్నాడు.  ఈ చిత్రంలో చిరంజీవి హిట్ సినిమా ‘ఖైదీ నెంబర్ 786’ లోని ఇటు అమలాపురం అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ పాటను అప్పట్లో సిల్క్ స్మిత చిరంజీవితో చేసింది. ఇప్పుడు మధురిమ ఈ పాటను చేయనున్నది. ఇప్పటికే సారధి స్టూడియోస్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్లో దర్శకుడు మారుతి చిత్రీకరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో బూతు సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మారుతీ ఈ సినిమాలో ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశాలు కూడా లేకుండా క్లీన్ ఎంటర్ టైన్మెంట్ మూవీగా మారుతి తన ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాను రూపొందించడమే కాకుండా అల్లుశిరీష్ కు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చేటట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు అని టాక్.  అల్లు శిరీష్ ను హీరోగా ఈ సినిమా ద్వారా మారుతీ నిలపెట్టగలిగితే మెగా కాంపౌండ్ లోని అల్లుఅర్జున్ పవన్ కళ్యాణ్ ల సినిమాలను చేసే అవకాసం వస్తుంది కాబట్టి మారుతి ఈ సినిమా పై విపరీతమైన శ్రద్ద పెడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: