విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మనుషులే కాదు భగవంతుడు కూడ అర్ధం చేసుకోలేడెమో. ప్రతి విషయం పైన వర్మ ఆలోచనా సరళి విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలపట్ల, వివాహ వ్యవస్థ పట్లా వర్మ ఆలోచనాతీరు ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి. వర్మ ఆలోచనలకు అద్దం పట్టే అతని పుస్తకం ‘నా ఇష్టం' చదవితే ఆ విషయాలు అన్నీ అర్థమవుతాయి.  తాజాగా వర్మకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ విషయం బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య సింగర్ నటి సుచిత్రా కృష్ణ మూర్తి తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ ‘డ్రామా క్వీన్' అనే పుస్తకం ఇటీవల విడుదల చేసింది. సుచిత్ర గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లో నటించింది. ఈ పుస్తకంలో ఆమె రాసిన మాటలు అనేక సంచలనాలకు దారితీస్తున్నాయి. గతంలో ఒకసారి సుచిత్ర రామ్ గోపాల్ వర్మ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళిచేసుకోమంటూ పెళ్లి ప్రోపోజల్ పెట్టిందట.  ఆ విషయమై సుచిత్ర ఆశ్చర్య పడేటట్లుగా వర్మ షాకింగ్ కామెంట్స్ చేసాడట ‘సుచిత్రా నీవు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు మన ఆలోచనలూ, ఆశయాలు ఒకటి కావు నీగురించి నా అభిప్రాయాలను మార్చుకోలేను. అంతేకాదు నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు నేను కేవలం మహిళలను సెక్స్ కు పనికి వచ్చే పరికరాలుగా మాత్రమే చూస్తాను’ అని వర్మ సుచిత్రతో అనడంతో మైండ్ బ్లాంక్ అయిన సుచిత్ర ఏమి అనాలో తెలియక అక్కడ నుండి వెళ్ళిపోవడమే కాకుండా ఆ కోపాన్ని దిగమింగుకుని తను రాసిన ‘డ్రామా క్వీన్’ పుస్తకంలో వర్మ నిజజీవితాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: