అక్కినేని నాగార్జున, పూరిజ‌గ‌న్నాధ్‌కి క‌బురు పెట్టాడ‌నే వార్త టాలీవుడ్‌లో తెగ చ‌క్కెర్లు కొడుతుంది. ఇదంతా అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం చేస్తున్న క‌స‌ర‌త్తులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్‌ను వ‌చ్చే సంవ‌త్సరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేయాల‌ని నాగార్జన కూడ తాప‌త్రయ ప‌డుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే నాగ‌చైత‌న్య ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అయ్యాడు, అలాగే అఖిల్ కూడ మంచి టైంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అయితే ఓ ప‌ని అయిపోతుంద‌ని నాగార్జున అనుకుంటున్నాడు. అఖిల్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రి కోసం ఎటువంటి క‌థ‌ల‌ను ఎంచుకోవాలో వంటి విష‌యాల‌ను స్వయంగా నాగార్జునే చూసుకుంటున్నాడు. ఇప్పటికే అఖిల్ కోసం దాదాపు ప‌దిహేను క‌థ‌ల‌ను వ‌ర‌కూ త‌న టేబుల్ మీద ఉన్నాయ‌ని అన్నపూర్ణ కాంపౌండ్ నుండి వినిపిస్తున్న వార్త. ఇందులో అయిదు క‌థ‌ల‌కు నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అయిదు క‌థ‌ల్లో పూరిజ‌గ‌న్నాధ్ క‌థ కూడ ఉంద‌ని అంటున్నారు. నాగార్జున‌, పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో ఇప్పటికే రెండు మూవీలు వ‌చ్చాయి. అవి కూడ బాక్సాపీస్ వ‌ద్ద బాగానే పేరు తెచ్చుకున్నాయి. అందుకే పూరిజ‌న్నాధ్ చేతుల మీద‌గా కొడుకు అఖిల్ ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేయాల‌ని భావిస్తున్నట్టుగా నాగార్జున ఆలోచిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అందులోని భాగంగానే కొద్ది రోజుల్లో నాగార్జనాని, పూరిజ‌గ‌న్నాధ్ క‌లిసే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్‌లో వినిపిస్తున్న స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: